టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటి ఆర్తి అగర్వాల్( Aarti Agarwal ).ఈ లోకానికి దూరమై చాలా కాలమైనా కూడా ఇప్పటికి ప్రేక్షకులు ఈమెను తలుచుకుంటూనే ఉంటారు.
అప్పట్లో తన అందంతో, నటనతో సినీ ప్రముఖులనే, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.కుర్ర హీరోల నుండి అగ్ర హీరోల వరకు అందరి సరసన నటించింది.
2001లో తొలిసారిగా నువ్వు నాకు నచ్చావ్( Nuvv naku nachavv ) సినిమాతో అడుగు పెట్టింది ఈ అందాల తార.ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దీంతో వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకొని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాలలో నటించింది.ఇక ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, వసంతం, ఇంద్ర, అందాల రాముడు, స్నేహం వంటి పలు సినిమాలు తనకు మంచి గుర్తింపును ఇచ్చాయి.ఈమె నటిగా కంటే వ్యక్తిగత విషయం లో మాత్రం బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.
అప్పట్లో తనతో కలిసి నటించిన తరుణ్ తో( ( tharun ) ) ప్రేమలో పడిందని.తర్వాత వీరిద్దరూ విడిపోయారని.
ఆ సమయంలో ఆ ప్రేమ విషయాన్ని తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని వార్తలు కూడా వినిపించాయి.
తర్వాత 2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్( Ujwal Nikam ) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికా కు వెళ్లి సెటిల్ అయింది.కానీ తన భర్తతో కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోయింది.
ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్లీ అడుగు పెట్టగా చిన్నచిన్న సినిమాలలో మాత్రమే నటించింది.కానీ అనుకోకుండా తనకు హార్ట్ ఎటాక్ రావటంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.
అయితే ఆమె ఈ లోకానికి దూరమైన కూడా ఆమె గురించి ఏదో ఒక వార్త ఇప్పటికి వినిపిస్తూనే ఉంటుంది.గతంలో ఆర్తి తరుణ్ కాకుండా వెంకటేష్ ను కూడా ప్రేమించిందట.
కానీ వెంకటేష్( venkatesh ) కు మాత్రం అటువంటి ఉద్దేశం లేదట.ఇక వీరిద్దరూ కలిసి నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా సమయంలో వీరి మధ్య బాగా క్లోజ్ నెస్ పెరిగిందని.
ఆ తర్వాత వసంతం సినిమాలో ఆ క్లోజ్ మరింతగా ముదిరిపోయిందని తెలిసింది.
అయితే ఆ సినిమాలో డైరెక్టర్ ఫస్ట్ నైట్ సీన్ అప్పుడు ఒక లిప్ లాక్ సీన్ రాసాడట.
ఇక వెంకటేష్ చేయను అంటూ బలవంతం చేయడంతో ఆ సిన్ ను తొలగించాడట డైరెక్టర్.కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం ఆయన మీద ఉన్న ఇష్టంతో ముద్దు సీన్ కోసం బాగా ఫోర్స్ చేసిందట.
చేద్దాం.నో ప్రాబ్లం.
నాకు ఇబ్బంది లేదు అంటూ తెగ ఆయన్ని లిప్ కిస్ పెట్టమంటూ ఫోర్స్ చేసిందట.కానీ వెంకటేష్ మాత్రం ఒక మాటతో నో అని చెప్పి తన పని తను చూసుకున్నాడని తెలిసింది.