కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి హాజరైన ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లు కర్ణాటక ప్రజలు అవినీతి సర్కార్ ను చూశారని చెప్పారు.
అవినీతిపరులు, ద్వేషం పెంచేవారిని ప్రజలు ఓడించారని రాహుల్ గాంధీ తెలిపారు.ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.
ఈ నేపథ్యంలో మొదటి కేబినెట్ భేటీలోనే హామీలపై సంతకాలు చేస్తామని తెలిపారు.కాంగ్రెస్ ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వదని స్పష్టం చేశారు.
రైతులు, వ్యాపారులు, కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమని వెల్లడించారు.