ప్రస్తుతం సమాజంలో మానవత్వం, మంచితనం లాంటి పదాలకు చోటు కరువైంది.ఆస్తి కోసం తల్లిదండ్రులపై, తోడబుట్టిన వారిపై, రక్త సంబంధీకులపై ఎటువంటి దారుణాల కైనా పాల్పడుతున్నారు.
ఆస్తికోసం కావాలంటే హత్యలు చేయడానికి అయినా సిద్ధమవుతున్నారు.ఇటీవలే కాలంలో మనిషి కేవలం డబ్బు, ఆస్తి అంతస్తులకు మాత్రమే విలువ ఇస్తూ బంధుత్వాలను తెంచుకుంటున్నాడు.
ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన తెలంగాణలోని మంచిర్యాలలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.మంచిర్యాల( Mancherial )లోని రాజీవ్ నగర్ కి చెందిన జంగాల స్వప్న అనే మహిళ భర్త వివాహం అయిన రెండేళ్లకు చనిపోయాడు.దీంతో స్వప్న కోటిపల్లి మండలం వెంచపల్లికి చెందిన వేల్పెలు మధును రెండో వివాహం చేసుకుంది.
కొంతకాలం వీరి సంసారం సాఫీగానే సాగింది.తరువాత మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడిపోయారు.
స్వప్న మూడవ వివాహం చేసుకుంది.ఇంతవరకు బాగానే ఉంది.
అయితే గతంలో స్వప్నకు దళిత బస్తీ పథకం కింద ప్రభుత్వం మూడు ఎకరాల భూమిని ఇచ్చింది.ఈ భూమి తన వల్లే స్వప్నకు వచ్చిందని, ఆ భూమిని తన పేరుపై రిజిస్టర్ చేయాలని మధు, స్వప్నను వేధించాడు.

భూమి ఇవ్వడానికి స్వప్న ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.ఎంత ప్రయత్నించినా స్వప్న భూమి రిజిస్టర్ చేయకపోవడంతో.ఆమె రెండో భర్త మధు కక్ష పెంచుకొని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.ఇటీవలే స్వప్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిందని తెలియడంతో.తన తమ్ముడు, తన తండ్రి తో కలిసి బైక్ పై వచ్చి మధు ఆమె కోసం కాపుకాశాడు.మున్సిపల్ కార్యాలయం నుండి బయటకు వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న స్వప్న పై.బైక్ పై వెళుతూ మధు కత్తితో దాడి చేశాడు.రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే పలుమార్లు కత్తితో పొడవడం వల్ల స్వప్న మెడ నరాలు పూర్తిగా మృతి చెందింది.
స్వప్న( Swapna ) చనిపోయింది అని తెలిశాక కోటపల్లి పోలీస్ స్టేషన్( Police station ) కు వెళ్లి లొంగిపోయాడు.స్వప్న చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.