భర్త స్నేహితుడి పై మోజుపడ్డ భార్య.. చివరికి ప్రియుడితో భర్తను దారుణంగా..!

ఈ సమాజంలో జరుగుతున్న మరణాలు ప్రమాదవశాత్తు జరుగుతున్నాయా.హత్యల లేదంటే ఆత్మహత్యల అనేవి అందరిని కలవర పెడుతున్నాయి.

 Andhra Pradesh Krishna District Crime News , Police , Krishna District , Andhr-TeluguStop.com

మనిషి చనిపోయిన తర్వాత విచారణ చేస్తే హత్యగా నిర్ధారణ అవుతుంది.ఇలాంటి మరణాలకు వివాహేతర సంబంధాలే కీలకం అవుతున్నాయి.

ప్రస్తుత సమాజంలో ఎదుటి వ్యక్తి ఆకర్షణకులోనే ఎంతటి దారుణం చేయడానికి అయినా వెనుకాడకుండా చివరికి తమ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు కొందరు మూర్ఖులు.అచ్చం ఇలాగే హైదరాబాద్ చోటు చేసుకుంది.

Telugu Andhra Pradesh, Affairs, Krishna-Latest News - Telugu

వివరాల్లోకెళితే.కృష్ణాజిల్లా ( Krishna District) మట్టం గ్రామానికి చెందిన జయకృష్ణ (36), మట్టం గ్రామానికే చెందిన దుర్గ భవానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.కొంత కాలం మట్టం గ్రామంలో నివాసం ఉండి ఆ తర్వాత హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పరిధిలో ఉండే ప్రసన్న నగర్ లో నివాసం ఉంటున్నారు.

Telugu Andhra Pradesh, Affairs, Krishna-Latest News - Telugu

జయకృష్ణ( Jayakrishna ) ఆలివ్ కాలనీలో జిమ్ ట్రైనర్ గా పనిచేస్తూ ఇంటిని పోషించేవాడు.దుర్గా భవాని ఇంట్లోనే ఉండేది.ఇంతవరకు సాఫీగా సాగిన వీరి సంసారం లోకి జయకృష్ణ స్నేహితుడు చిన్నా అనే వ్యక్తి ఇంటికి రావడం మొదలుపెట్టాక మనస్పర్ధలు మొదలయ్యాయి.

చిన్నాతో దుర్గ భవాని అక్రమ సంబంధం పెట్టుకుంది.భర్తకు తెలియకుండా చిన్నాతో వివాహేతర సంబంధం కొనసాగించింది.ఆర్థిక పరిస్థితుల కారణంగా జయకృష్ణ తిరిగి తమ సొంత ఊరికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు.కానీ దుర్గ భవాని అందుకు అంగీకరించలేదు.

ఈ విషయాన్ని దుర్గాభవాని తన ప్రియుడైన చిన్నాకు చెప్పింది.ఇద్దరూ కలిసి జయకృష్ణను హత్య చేయాలని, అప్పుడే తమ అక్రమ సంబంధా( Extramarital Affairs )నికి ఎటువంటి అడ్డు ఉండదని మాస్టర్ ప్లాన్ వేశారు.

ప్లాన్ లో భాగంగా చిన్నా, జయ కృష్ణకు పీకల దాకా మద్యం తాగించాడు.ఆ తరువాత ఇద్దరు కలిసి మద్యం మత్తులో ఉన్న జయకృష్ణ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.

తన భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని దుర్గాభవాని అందర్నీ నమ్మించింది.జయకృష్ణ కుటుంబ సభ్యులకు మాత్రం ఎక్కడో చిన్న అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమదైన శైలిలో పోలీసులు విచారించగా ప్రియుడుతో కలిసి దుర్గ భవాని ఈ దారుణం చేసినట్లు తేలింది. పోలీసులు( Police ) ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube