గ్రహాంతరవాసులు గురించిన వార్తలు మనం చిన్నప్పటినుండి వింటూనే వున్నాం.ఇక సినిమాలకైతే లెక్కేలేదు, ఏలియన్స్ అనే కాన్సెప్ట్ మీద ఎంతోమంది సినిమాలు తీసి మంచి వ్యాపారం చేసుకున్నారు.
అయితే ఏలియన్స్( Aliens ) మనుషులకు కనబడిన దాఖలాలు మాత్రం ఎక్కడా లేవు.అవి విన్నాయో లేవో కూడా జనాలకి తెలియదు కానీ, కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం అవి ఉన్నాయని, అప్పుడప్పుడు ఇతర గ్రహాలనుండి భూమిపైకి వచ్చి షికారు చేసి వెళుతూ వుంటాయని చెబుతూ వుంటారు.

ప్రపంచంలో ఇలాంటి మిస్టరీలు చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి.కొన్ని రహస్యాలు భూమిపై, మరికొన్ని అంతరిక్షంలో ఉన్నాయి.నేటికీ, గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల వాదనలు ఉన్నాయి.అమెరికాలోని నెవాడాలో( Nevada ) ఉన్న ఏరియా 51 చుట్టూ సాధారణ పౌరులు తిరగడం నిషేధించబడింది.
సాధారణ పౌరుల రాకపోకలపై నిషేధం కారణంగా ఈ స్థలం గురించి అనేక వాదనలు ఉన్నాయి.గ్రహాంతరవాసులను ఇక్కడ ఉంచి వాటిపై పరిశోధనలు జరుపుతున్నట్లు ప్రజలు ఊహిస్తున్నారు.

అనేక నివేదికలలో, యార్క్‌షైర్( Yorkshire ) (యార్క్‌షైర్, ఇంగ్లాండ్)లో గ్రహాంతరవాసులు వస్తూ పోతూ ఉంటారని, ప్రజలు వారి విమానాలను కూడా చూశారని కధలుకధలుగా చెబుతూ వుంటారు.మనుషులు వచ్చి వెళ్లని మంచుతో కప్పబడిన అంటార్కిటికాలో గ్రహాంతరవాసులకు చోటు ఉంటుందని కొందరి అభిప్రాయం.అదేవిధంగా న్యూ మెక్సికోలోని ఒక గ్రామంలో మెక్సికన్ తెగ ప్రజలు నివసిస్తున్నారు.ఈ గ్రామం సమీపంలో అమెరికా రహస్య ఆర్మీ బేస్ ఉందని.ఇక్కడ గ్రహాంతరవాసులు వచ్చి వెళ్తారని ఇక్కడివారు నమ్ముతారు.ఇక గ్రహాంతర వాసులు తమ ఆవులను ఎత్తుకెళ్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు.
అయితే ఇందులో ఎంత నిజం వుందో ఆ దేవుడికెరుక.







