ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగితే వచ్చే జోష్ అంతా ఇంతా కాదు.టీ పడగానే మైండ్ రిఫ్రెష్ అయినట్లు ఉంటుంది.
అందుకే చాలా మంది తమ రోజు ను టీతోనే ప్రారంభిస్తుంటారు.ఇక మార్కెట్లో ఎన్నో రకాల టీ పౌడర్లు అందుబాటులో ఉన్నాయి.
కానీ వాటికి బదులుగా ఇప్పుడు చెప్పబోయే టీ పౌడర్( Tea powder ) ను వాడితే ఎలాంటి బాన పొట్ట అయినా దెబ్బకు కరిగిపోతుంది.అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీ పౌడర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు టర్మరిక్ పౌడర్( Turmeric powder ) ను వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ అల్లం పొడి, వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి మూత పెట్టి బాగా షేక్ చేయాలి.తద్వారా టర్మరిక్ టీ పౌడర్ సిద్ధం అవుతుంది.
ఈ టీ పౌడర్ ను రోజు వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

ఈ టీ పౌడర్ ను పావు టేబుల్ స్పూన్ చొప్పున ఒక గ్లాస్ వాటర్ లో వేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.ఆపై టీను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) కలిపి సేవించాలి.ఈ టర్మరిక్ టీ పౌడర్ ను రోజు వాడితే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు దెబ్బకు కరిగిపోతుంది.
బాన పొట్ట కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారుతుంది.

అలాగే ఈ టర్మరిక్ టీ పౌడర్ ను వాడటం వల్ల మోకాళ్ళ నొప్పుల నుండి విముక్తి లభిస్తుంది.డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.
బాడీ డీటాక్స్ అవుతుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే తగ్గుముఖం పడతాయి.
బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా కూడా మారుతుంది.