పెరుగుతో పాటు ఉల్లిపాయను మామిడి పండ్లను కలిపి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!

పెరుగు ఆరోగ్యానికి మంచిదని దాదాపు చాలా మందికి తెలుసు.ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని పెద్దవారు చెబుతుంటారు.

 Are You Eating Onion And Mangoes Together With Curd..but It Is Dangerous..!, Man-TeluguStop.com

పెరుగు మంచి ప్రోబయోటిక్ కావడం వల్ల ప్రేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.అయితే పెరుగును చాలామంది ఏదో ఒక దాంట్లో కలుపుకుని తింటూ ఉంటారు.

కొన్ని ఆహార పదార్థాలు కలిపి తినడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.పెరుగు లో పండ్లు కలుపుకునే తినవచ్చు.

సలాడ్, రైతా వంటివి చేసుకుని తినవచ్చు.పెరుగు( Curd ) తో పాటు కలుపుకుని తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Curd, Fish, Tips, Mangoes, Milk, Sea-Telugu Health

చాలామంది పెరుగు లో మామిడి పండ్లు( Mangoes ) కలుపుకొని తింటారు.మామిడి పండ్లు వేడి గుణాలను కలిగి ఉంటుంది.పెరుగు చలువ గుణం కలిగి ఉంటుంది.ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి వేడి చల్లని అసమతుల్యతను కలిగిస్తుంది.ఇది చర్మ సమస్యలను కలిగిస్తుంది.చర్మంపై దద్దుర్లు, మొటిమలు ఏర్పడడం జరుగుతుంది.

శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తిని పెంచుతుంది.మాంసాహారం వండేటప్పుడు మాంసాన్ని పెరుగుతో మెరినేట్ చేస్తారు.

కానీ చేపలు, సముద్రపు ఆహారంలతో పెరుగును అసలు కలపి తినకూడదు.ఇలా తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది.

Telugu Curd, Fish, Tips, Mangoes, Milk, Sea-Telugu Health

అలాగే పెరుగు తిన్న తర్వాత పాలు త్రాగడం కూడా అసలు చేయకూడదు.పాలు తాగిన తర్వాత పెరుగు కూడా తినకూడదు.ఒకవేళ ఈ రెండింటిని కలిపి తీసుకుంటే గ్యాస్ ఉబ్బరం కడుపు గుండెల్లో మంట లాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అలాగే పెరుగుతో పాటు నెయ్యి, నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను కూడా అసలు తినకూడదు.

ఇలా ఈ ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల తినడం వల్ల జీర్ణ వ్యవస్థ( Digestive system ) పై చెడు ప్రభావం పడుతుంది అలాగే నిద్ర మత్తు కూడా ఎక్కువగా ఉంటుంది.అలాగే పెరుగుతో పాటు ఉల్లిపాయలు కూడా అసలు తినకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube