కెరియర్ మొదట్లో ఎన్టీయార్ ని హేళన చేసిన ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా..?

ఈ జనరేషన్ లో నందమూరి కుటుంబాన్ని ముందుకు తీసుకు వెళ్తున్న నటుడు జూనియర్ ఎన్టీయార్( junior NTR ) ప్రస్తుతం ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు… బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.తన తాత హీరోగా వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

 Do You Know The Producer Who Made Fun Of Ntr At The Beginning Of His Career , Nt-TeluguStop.com

ఆ తరువాత ఇదే సినిమాను హిందీ వర్షన్ లో కూడా తెరకెక్కించాలని చూశారు.కానీ అక్కడ విడుదల కాలేదు.

ఇక ఆ తర్వాత 1997లో అంతా చిన్న పిల్లలతో కలిసి రామాయణం సినిమాను తెరకెక్కించారు.

 Do You Know The Producer Who Made Fun Of NTR At The Beginning Of His Career , Nt-TeluguStop.com
-Movie

ఈ సినిమాలో బాల రాముడిగా పౌరాణిక పాత్రలో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.అంతేకాదు ఈ సినిమాతో మొదటిసారి తొలి నంది అవార్డును( Nandi Award ) కూడా అందుకున్నారు తారక్.ఈ సినిమాకు జాతీయస్థాయిలో అవార్డు కూడా లభించింది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత ఒకేసారి ఆయన హీరోగా 2001లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్( Ushakiran Movies Banner ) పై నిన్ను చూడాలని అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.ఈ చిత్రాన్ని దివంగత వంకినేని రత్న ప్రతాప్ దర్శకత్వం వహించారు.

-Movie

నవంబర్ 2000వ సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ మొదలవగా.అప్పుడు ఎన్టీఆర్ వయసు 17 సంవత్సరాలు మాత్రమే.ఇక 18వ ఏటా ఆయన పుట్టినరోజు తర్వాత ఐదు రోజులకు అంటే మే 25న ఈ మూవీ విడుదలయ్యింది.పూర్తిస్థాయి హీరోగా మారిన ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఏకంగా 4 లక్షల రూపాయలు పారితోషకం అందుకున్నారు.

అయితే అంత డబ్బును అంత చిన్న వయసులోనే సంపాదించినప్పుడు దానిని ఏం చేయాలో తెలియక ఒకరోజు లెక్క పెడుతూ కూర్చున్నాడట… ఎన్నిసార్లు లెక్కపెట్టినా ఆ డబ్బుతో తాను ఏం చేయాలో తెలియక అమ్మ చేతిలో పెట్టాను అంటూ తెలిపారు ఎన్టీఆర్.ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్ల పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగారు తారక్.తను మొదట కొంత మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి నాతో సినిమా తీయమంటే అప్పుడు కొంత మంది ఎన్టీయార్ ని హేళన చేశారు ఇప్పుడు వాళ్ళే ఆయన దగ్గరికి వచ్చి ఒక్క సినిమా చేయమని బతిమాలుకుంటున్నారు…ఆ ప్రొడ్యూసర్ ఎవరు అనేది పక్కన పెడితే ఇలా కసి గా పోరాడి మరి మన ఎన్టీయార్ యంగ్ టైగర్ గా గుర్తింపు పొందాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube