తాజాగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై సినీ,రాజకీయ విశ్లేషకులు, దర్శక నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ( Tammareddy Bharadwaja ) సంచలన వాఖ్యలు చేశారు.తాజాగా ఒక వీడియోని విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ ఆ వీడియోలో ఈ విధంగా చెప్పుకొచ్చారు.
ఆ వీడియోలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.మనకి ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు.
రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం.రాష్ట్రం కోసం మనం ఏదైనా చేయాలి.ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు.వెరీ గుడ్.చాలా బ్రహ్మాండంగా చెప్పారు.నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదే.నాయకుడు అనేవాడికి కన్ఫ్యూజన్ ఉండకూడదు.పవన్ ఆల్రెడీ నాయకుడు.
ప్రత్యేకించి అవ్వాల్సింది ఏం లేదు.

పవన్ కళ్యాణ్ కి రాజకీయాల లోకి రావడం ద్వారా కొత్తగా వచ్చేదేం లేదు.ఆయనకి ఉండాల్సిన ఇమేజ్ ఆయనకి ఉంది.అంతటి ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఎవరో చేస్తే ముఖ్యమంత్రి అవ్వరు.
ఆయనంతట ఆయన అవ్వాలనుకుంటే అవుతారు.ఎవరో చేస్తే ముఖ్యమంత్రి అవ్వడం ఏంటి? ఆయన తలుచుకోవాలి అంతే అని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.అయితే జనం ఓట్లు వేయలేదు అని అనడం నాకు నిజంగా బాధ వేసింది.ఓట్లు వేయలేదంటే ఈయన సరిగా ప్రయత్నం చేయలేదు.కనీసం ప్రచారం కూడా చేయలేదు.ముఖ్యమైన నియోజక వర్గాల్లో కూడా తిరగలేదు.
ఈయన చేయాల్సిన ప్రయత్నం ఈయన చేయకుండా జనం ఓట్లు వేయలేదని అంటున్నారు.

ఓట్లు వేయలేదనేది ఎంత వరకూ నిజం? అంటూ నిలదీశారు.అయితే కర్ణాటక( Karnataka ) ఎలక్షన్స్‌లో కుమారస్వామి కూడా అలాగే అనుకున్నారు.ఎవరు గెలిచినా కూడా నేనే కింగ్ మేకర్ అవుతానని అనుకున్నారు.
కానీ నిల్ అయ్యారు.రాజకీయాల్లో కావాల్సింది కింగ్ మేకర్ కావడం కాదు.
కింగ్ అవ్వాలి.పవన్ కళ్యాణ్ ఒక నాలుగు సీట్లు గెలిచి బ్లాక్ మెయిల్ చేసి ముఖ్యమంత్రి సీటు తీసుకునే వ్యక్తి కాదు.
అలా అనుకోవడం కూడా తప్పు.కానీ ఆయన సౌండింగ్ నాకు అలా అనిపించింది అని తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ.







