Rashmi Gautam : నెటిజన్ కి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన రష్మీ.. నేను ప్రభుత్వాన్ని కాదు అంటూ?

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా చిన్నారులు వీధి కుక్కల దాడిలో మరణిస్తున్నారు.ఒక ప్రదేశంలో జరిగిన ఘటనలు మరువకముందే ఇలాంటి ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి.

 Anchor Rashmi Shocking Answer To Netizens Who Target To Her Regard Dogs Attack-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా వీధి కుక్కల దాడిలా మరో చిన్నారి మృతి చెందింది.తాజాగా జరిగిన ఈ సంఘటన రాష్ట్రాన్ని షాక్ కి గురి చేస్తోంది.

ఇది హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.ఇంతవరకు బాగానే ఉన్నాయి ఘటనపై చాలా మంది యాంకర్ రష్మీ( Rashmi Gautam ) ని ఉద్దేశిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

కాగా యాంకర్ రష్మీ యానిమల్ లవర్ అన్న విషయం మనందరికి తెలిసిందే.

కుక్కల విషయంలో ఆమె ఎంత కేర్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే.మూగ జంతువులకు సంబంధించి ఎటువంటి వీడియోలు వైరల్ అయినా వెంటనే వాటి పై తనశైలిలో స్పందిస్తూ ఉంటుంది.అయితే తాజాగా కాజీపేట రైల్వే స్టేషన్‌లో చిన్నారిని కుక్కలు కరిచి చంపిన నేపథ్యంలో దాన్ని ట్యాగ్‌ చేస్తూ దీనికి ఏం సమాధానం చెబుతారని రష్మిని నిలదీస్తున్నారు నెటిజన్స్.

తెలంగాణ( Telangana )లో వీధికుక్కల( Dogs ) దాడిలో మరో బాలుడు మృతి, ఈ న్యూస్‌ చూశారా మేడమ్.మీరు జంతు ప్రేమకులు కాదనడం లేదు, నిత్యం కార్లలో బంగ్లాలో ఉండే మీకు ఏం తెలుస్తుంది.

వీధి కుక్కల కోసం మీకు డబ్బు ఉంది.ఆ చిన్నారి వాళ్ళ వాళ్ల నాన్న రోడ్ పైన చెవి రింగులు అమ్ముకుంటాడు అని ఒక నెటిజన్ పోస్ట్ చేసాడు.

మీరు ఒక సినిమా పోతేనే తట్టుకోలేరు అలాంటిది అక్కడ ఒక బాబు ప్రాణం పోతే వాళ్ల అమ్మనాన్నలు ఎలా తట్టుకుంటారు.దయజేసి వాళ్లకి ఏదో ఒక రూపంలో సహాయం చేయండి.మీరు పెంపుడు కుక్కలు మధ్య పెరుగుతారు.సాధారణ జనం వీధికుక్కల మధ్య పెరుగుతారు అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు.ఇలా నెటిజన్స్ వరుసగా ఒకరి తరువాత ఒకరు ఆ ఘటనపై రష్మీని ఉద్దేశిస్తూ ట్యాగ్ చేయడంతో వెంటనే రియాక్ట్ అయిన రష్మీ నెటిజన్స్ కి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.నన్ను ట్యాగ్‌ చేయడం, ఈ విషయాలను నన్ను అడగడం వల్ల ఎలాంటి సహాయం రాదు, నేను ప్రభుత్వం కాదు, నిధులు జారీ చేయను, ఆ నిధులను తినను.

నిజానికి నేను చేయగలిగినంత కుక్కలకు క్రిమిరహితం చేయడానికి వ్యక్తిగత డబ్బుని ఉపయోగిస్తున్నాను అంతే అని తెలిపింది.మరో ట్వీట్ పై స్పందిస్తూ.

మీరు తప్పుగా ట్యాగ్‌ చేశారని, దీనికి ప్రభుత్వానికి ట్యాగ్‌ చేయాలని, చట్టవిరుద్ధమైన పెంపకంపై కఠినమైన చర్యలు తీసుకోండి.ప్రత్యక్ష పెంపుడు జంతువుల అమ్మకం, కొనుగోలుని నిషేధించండి.

మన కుక్కలను దత్తత తీసుకోవచ్చు, వాటిని రోడ్లపై లేకుండా చేయవచ్చు అని చెప్పుకొచ్చింది రష్మి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube