టాలీవుడ్ కి చెందిన పెద్ద ఫ్యామిలీల్లో దగ్గుబాటి ఫ్యామిలీ( Daggubati family ) ఒకటి అనడంలో సందేహం లేదు.దగ్గుబాటి రామా నాయుడు తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన గొప్ప సినిమా లు మరో వంద సంవత్సరాలు అయినా నిలిచి పోతాయి.
నిర్మాతగా ఆయన గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నాడు.ఆయన తనయుడు సురేష్ బాబు నిర్మాతగా కొనసాగుతున్నారు.
ఇక రామా నాయుడు మరో తనయుడు వెంకటేష్( Venkatesh ) హీరోగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెల్సిందే.
ఇక మరో జనరేషన్ కూడా ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది.రానా హీరోగా ఇప్పటికే వరుసగా సినిమా లు చేస్తున్నాడు.సురేష్ బాబు మరో తనయుడు అభిరామ్( Abhiram ) హీరోగా అహింస అనే సినిమా రూపొందింది.
సురేష్ బాబు తల్చుకుంటే అభిరామ్ ను వంద కోట్ల సినిమా తో హీరోగా పరిచయం చేయవచ్చు.కానీ చిన్న సినిమా తో తేజ దర్శకత్వంలో ఒక సినిమాతో అభిరామ్ ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు.
ఆ సినిమా కూడా విడుదలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.హీరోగా అభిరామ్ మొదటి సినిమానే ఇన్ని చిక్కులు ఎదుర్కొంటే దాని ఫలితం ఏంటి… ముందు ముందు అతడి కెరీర్ ఏంటో అంటూ దగ్గుబాటి అభిమానులు( Daggubati fans ) అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇండస్ట్రీకి తేజ ఎంతో మందిని పరిచయం చేయడం జరిగింది.ఇప్పుడు అదే దారిలో మరెంతో మందిని కూడా ఆయన పరిచయం చేయాలని భావిస్తున్నాడు.అందులో భాగంగానే సెకండ్ ఇన్నింగ్స్ లో అభిరామ్ ను హీరోగా ఇండస్ట్రీకి తీసుకు రావాలని భావించాడు.ఇప్పటికే విడుదల అవ్వాల్సిన అహింస సినిమా ఇంకా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
తాజాగా విడుదల తేదీని ప్రకటించి క్యాన్సల్ చేశారు.ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సినిమా లో క్లైమాక్స్ ని మార్చుతున్నారని.
క్లైమాక్స్ మార్చిన తర్వాత సినిమా యొక్క విడుదల తేదీని మళ్లీ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.