వీడియో: పులిని ఆటాడించిన జింక.. దాని ఎస్కేప్‌కు బిత్తరపోయిన పులి..

సుందర్‌బన్స్ మడ అడవులలో చోటు చేసుకున్న ఒక సంఘటనకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో పులి తన ఎరను వేటాడుతున్న భయానక క్షణాలు కనిపించాయి.

 Video Deer Teases Tiger, Sunderbans Mangroves, Tiger, Prey, Ifs Officer Susanta-TeluguStop.com

ఈ క్రూర జంతువులు జింకలు లేదా ఇతర జంతువులను చాలా చాకచక్యంగా పట్టేసి చంపేస్తాయి.వీలైనంత దగ్గరగా వెళ్లేందుకు అవి స్టాకింగ్ టెక్నిక్‌ని ఉపయోగిస్తాయి.

ఈ టెక్నిక్ తో అవి ఎలాంటి ఎరనైనా ఈజీగా పట్టుకుంటాయి.అయితే ఒక జింక మాత్రం పులి నుంచి చాలా తెలివిగా తప్పించుకొని ఆశ్చర్యపరిచింది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ( Indian Forest Service )(IFS) అధికారి సుశాంత నంద( Sushantha Nanda ) ఈ గ్రేట్ ఎస్కేప్ కి సంబంధించిన వీడియో ని షేర్ చేశారు.

అందులో పొదల్లో దాగి ఉన్న పులి, సమీపంలో మేత మేస్తున్న మూడు జింకలను గమనిస్తూ ఉంటుంది.

ఈ దాడి ఒక నది ప్రవాహానికి సమీపంలో జరుగుతుంది.జింకలు పులి( Deer tiger ) ఉనికిని గుర్తించిన వెంటనే, దాని నుంచి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అవి వేగంగా పారిపోతాయి.

జింకలలో ఒకటి నీటిలోకి దూకుతుంది.అయితే పులి దానిని వెంబడిస్తూ అది కూడా నీటిలోకి దూకేస్తుంది.

మిగిలిన రెండు జింకలు తృటిలో తప్పించుకోగలిగాయి.అయితే, తదుపరి జింక బలయిందని అందరూ అనుకున్నారు.

పులి ఎర మెడపై తన పళ్లకింద నలిపేస్తుందని భయపడ్డారు.కానీ జింక నీటిలో మునిగి ఏం పులికి కనిపించకుండా కాసేపు మాయమవుతుంది.మళ్లీ పైకి వచ్చినప్పుడు, అది పులికి అలా అడుగుల దూరంలో తేలుతుంది.జింక వెంటనే చాలా వేగంతో తిరిగి భూమికి ఈదుతుంది.కానీ పులి చాలా వెనక ఉండిపోతుంది.ఆ పులి వేగంగా భూమి పైకి వచ్చిన మంచి ఇంకా అప్పటికే అక్కడి నుంచి తుర్రు మంది.

అప్పటికే అలసిపోయిన పులిని దానిని వెంబడించడం మానేసింది.ఇంకా తెలివి చూసి చివరికి అది బిత్తర పోయింది.

IFS అధికారి సుశాంత నందా, ట్విట్టర్‌లో వీడియోను పంచుకుంటూ, సుందర్‌బన్స్ మడ అడవులలోని పులులు నీటిలో కూడా తమ ఆహారాన్ని పట్టుకోవడంలో ఎలా నైపుణ్యం కలిగి ఉంటాయో వివరించారు.అతను క్లిప్‌కి “ఓహ్ డియర్ జింక.సుందర్‌బన్స్ మడ అడవుల పులులు నీటిలో కూడా తమ వేటను పట్టుకోవడానికి అనువుగా ఉంటాయి.కానీ ఇక్కడ ఒక పెద్ద పులి నుంచి జింకను అదే నీరు తప్పించింది.” అని పేర్కొన్నారు.ఈ వీడియోను చూసిన జంతు ప్రేమికులు జింక మనుగడ ప్రవృత్తిని కొనియాడారు.

ఒక వినియోగదారు ట్విట్టర్‌లో జింక కదలికను “స్మార్ట్ మూవ్”గా అభివర్ణించారు.కొంతమంది నెటిజన్లు జింక జీవించాలనే దృఢ సంకల్పాన్ని ప్రశంసించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube