మొన్నటిదాకా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఇటీవల పరామర్శించడం తెలిసిందే.దీనిలో భాగంగా ఉభయగోదావరి జిల్లాలలో నీట మునిగిన పంటలను మొన్నటిదాకా పరిశీలించటం జరిగింది.
నష్టపోయిన పంటను ప్రభుత్వం రైతుల వద్ద కొనాలని ఒత్తిడి తీసుకురావడం జరిగింది.ఆ తర్వాత మళ్లీ యధావిధిగా పార్టీ కార్యక్రమాలు చేపడుతూ ఇటీవల ఫుల్ బిజీగా పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో మొన్న కృష్ణ జిల్లా పర్యటనలో ఫుల్ బిజీ అయిన చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇప్పటికే విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాలలో పర్యటించడం జరిగింది.ఈ క్రమంలో శృంగవరపుకోట నుంచి అనకాపల్లి( Anakapalli ) వెళుతూ మార్గమధ్యంలో చంద్రబాబు శుక్రవారం తన కాన్వాయ్ ఆపి సరిపల్లి వద్ద ఓ టీ దుకాణం( Tea Stall ) ఉండగా… అక్కడ టీ తాగటం జరిగింది.ఈ సందర్భంగా టీ దుకాణ యజమానురాలు శివమ్మతో చంద్రబాబు మాట్లాడారు.
ఆమె చెప్పిన కష్టాలకు చంద్రబాబు తల్లడిల్లిపోయారు.సొంత ఇల్లు లేకపోవడంతో పాటు… పిల్లలను చదివించే ఆర్థిక స్తోమత లేదని తెలియజేయడం జరిగింది.
దీంతో శివమ్మ చెప్పిన మాటలకు స్పందించిన చంద్రబాబు పిల్లలను చదివించడానికి ఏర్పాటు చేస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు.అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.







