Jayalalitha ANR: అక్కినేని తో నటించను అని తెగేసి చెప్పిన జయలలిత.. అందుకోసమేనా ?

జయలలిత…( Jayalalitha ) 1970, 80 దశకాల వరకు జయలలిత అగ్రతారగా సౌత్ ఇండియాలో ఒక వెలుగు వెలిగింది.ఆమె సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న టైం లోనే అక్కినేని, ఎన్టీఆర్ వంటి వారు కూడా తెలుగు సినిమా రంగాన్ని పెద్ద ఎత్తున శాసిస్తూ వస్తున్నారు.

 Why Jayalalitha Not Intrested To Act With Akkineni Nageswara Rao-TeluguStop.com

ఆ టైంలో అక్కినేని లేదా ఎన్టీఆర్ వంటి హీరోలతో నటించాలని ప్రతి హీరోయిన్ కలలు కనేవారు.అలాంటి అవకాశం కోసం ఎంతో మంది సినిమా ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉండేవారు.

అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.తమిళంలో అగ్ర కథానాయకగా దూసుకుపోతున్న జయలలిత తెలుగులో కూడా చాలా సినిమాలో నటించారు.

Telugu Akkineni, Jayalalitha, Nandamuritaraka, Savitri, Shivaji Ganesan, Sobhan

కానీ అందరు హీరోయిన్స్ తో పోలిస్తే జయలలిత కాస్త భిన్నమైన వైఖరితో ఉంటారు.ఆమె రూటే సపరేట్.జయలలిత సినిమా లో నటించాలంటే కేవలం కథ మాత్రమే కాదు, హీరోని బట్టి కూడా ఆమె ఆ చిత్రాన్ని చెయ్యాలా వద్దా అని ఆలోచించే వారట.ఒకవేళ గనుక సినిమా కథ నచ్చిన హీరో నచ్చకపోతే ఆమె ఆ సినిమాను చేయడానికి ఒప్పుకునే వారు కాదు.

అందుకే పారితోషకం తో సంబంధం లేకుండా ఆమె కొన్ని సినిమాల్లో, కొంత మంది హీరోలతో నటించలేదు.ఉదాహరణకు తమిళనాడు లో శివాజీ గణేషన్ కి( Shivaji Ganeshan ) మంచి పేరుంది.

కానీ ఆయన పక్కన ఒకటి లేదా రెండు సినిమాల్లో మాత్రమే నటించారు.

Telugu Akkineni, Jayalalitha, Nandamuritaraka, Savitri, Shivaji Ganesan, Sobhan

ఇక తెలుగులో కూడా అక్కినేని( Akkineni Nageswara Rao ) వంటి హీరోతో చేయడానికి ముందుకు రాలేదు.అందుకు గల కారణం అక్కినేని హైట్ అని అప్పట్లో అందరూ గుసగుసలాడారు.ఎందుకంటే ఆమె పక్కన నటించే హీరో ఖచ్చితంగా మంచి అందగాడు అలాగే హైట్ వెయిట్ అన్ని బాగుండాలి.

లేదంటే తన ఫాన్స్ ఫీల్ అవుతారని ఆమె అలా చేశారట.అప్పట్లో జయలలితకు అభిమాన సంఘాలు ఎక్కువగా ఉండేవి.వాటిని ఆమె పెంచి పోషించేవారు.ఆమెతో పాటు సావిత్రి లాంటి వారు కూడా ఎక్కువగా అభిమాన సంఘాలను మెయింటైన్ చేసేవారు.

తన అభిమానులు అక్కినేని వంటి షార్ట్ హీరోతో నటిస్తే నచ్చుకుంటారని అతనితో నటించడానికి ఓకే చేయలేదు జయలలిత.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube