సన్ ఫ్లవర్ ఆయిల్( Sunflower oil ) కు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో రైతులు పొద్దు తిరుగుడు( Sunflower ) సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఈ పంట సాగుకు అన్ని కాలాలు అనుకూలంగానే ఉంటాయి.
వేసవిలో నేలను రెండుసార్లు బాగా దుక్కి, తరువాత ఎకరాకు మూడు టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి.ఒక ఎకరానికి 2.5 కిలోల విత్తనాలు అవసరం.ముందుగా విత్తనాలను 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.విత్తన శుద్ధి చేసుకుంటే భూమిలో ఉండే చీడపీడల బెడద చాలావరకు అరికట్టినట్టే.
నేల యొక్క స్వభావాన్ని బట్టి నీటి తడులను అందించాలి.నల్లరేగడి నేలలు అయితే 15 రోజులలో ఒకసారి, ఎర్రనేలల( Red soil )లో అయితే పది రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి.
ముఖ్యంగా మొగ్గ తొడుగుదశ, పువ్వు వికసించే దశ, గింజ కట్టు దశలలో నీటి తడులు అందించడం తప్పనిసరి.
ఈ పంటను ఆశించే తెగుల విషయానికి వస్తే పూత సమయంలో వర్షాలు పడినప్పుడు పువ్వు కుళ్ళు తెగులు పంటను ఆశిస్తాయి.
ఈ తెగులు ఆకులను ఆశించడంతో మొక్కలు ఎండిపోతాయి.మొక్కకు ఉండే ఆకు కింది భాగం గోధుమ రంగులోకి మారుతుంది.తెగుల నివారణకు లీటరు నీటిలో 1 మి.లీ ఫెన్దియాన్ కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
శీతాకాలంలో తుప్పు తెగులు పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఈ తెగులు సోకినప్పుడు ఆకులపై చిన్న వర్ణపు పొక్కులు ఏర్పడి తర్వాత పువ్వులోని పచ్చని భాగాలకు వ్యాపించి మొక్క ఎండిపోయేలా చేస్తాయి.
ఈ తెగుల నివారణకు లీటరు నీటిలో 2గ్రా.జిబెన్ కలిపి పంటకు పిచికారి చేయాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను నిర్మూలించాలి.వ్యవసాయ క్షేత్రం నిపుణుల సలహాతో మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తుకుంటే వివిధ రకాల శిలీంద్రాలు పంటను ఆశించే అవకాశం ఉండదు.