టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరినీ ఓకే వేదిక పైకి తీసుకువచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.దీనికి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను వేదికగా చేసుకోబోతున్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో పాటు , టిడిపి( TDP ) భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో ఈ మేరకు పక్క వ్యూహాలతో చంద్రబాబు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే జనసేన మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యారు.
అలాగే ఈసారి ఎన్నికల్లో నందమూరి కుటుంబం పూర్తి మద్దతు తమకు ఉండేలా చూసుకుంటున్నారు.ఈసారి రాజమండ్రి వేదికగా జరగబోయే మహానాడు వేదిక ద్వారా చంద్రబాబు ఎన్నికల కసరత్తును మొదలుపెట్టనున్నారు.
అంతకంటే ముందుగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ద్వారా తమకు దూరమైన వారందరినీ దగ్గర చేసుకోవడంతో పాటు, ప్రజలను ప్రభావితం చేయగలిగిన సినీ తారల మద్దతు కూడగట్టి తద్వారా వారి అభిమానులు ఓట్లను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.ఈనెల 20వ తేదీన హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుగునున్నాయి.
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు లోని కైతలాపూర్ మైదానంలో వీటిని నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే నిర్వహణ కమిటీ నందమూరి కుటుంబంతో పాటు, పలువురు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి ఆహ్వానాలు పంపింది.ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.అలాగే బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఎన్టీఆర్( NTR ) సమగ్ర సినీ జీవితంపై ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను సంకలనం చేసిన శక పురుషుడు ప్రత్యేక సవనీర్, అలాగే ఎన్టీఆర్ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు , సినిమాలు , ఉపన్యాసాలు వంటి పూర్తి సమాచారంతో రూపొందించిన జై ఎన్టీఆర్ వెబ్ సైట్ ను ఆవిష్కరించనున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీకి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , కన్నడ చిత్ర హీరో శివకుమార్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ , దగ్గుపాటి వెంకటేష్ , సుమన్, మురళి మోహన్ జినందమూరి కళ్యాణ్ రామ్, జయప్రద, దర్శకుడు కే రాఘవేంద్రరావు , నిర్మాతలు జి ఆదిశేషగిరిరావు, అశ్విని దత్ వంటి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.పవన్ కళ్యాణ్ తో పాటు, ప్రభాస్ ,అల్లు అర్జున్ వంటి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది వీరందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావడం ద్వారా వారి అభిమానుల మద్దతు టిడిపికి ఉండే విధంగా చంద్రబాబు వ్యవహాత్మకంగా దీనిని ప్లాన్ చేసినట్టు గా కనిపిస్తున్నారు.







