అమరావతి ఆర్-5 జోన్ భూములను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.అనంతరం ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కొందరు సైందవుల్లా అడ్డుపడుతున్నారని సజ్జల ఆరోపించారు.కావాలనే అన్ని రకాలుగా ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
అమరావతిలో పేదలు ఉండొద్దనేది వారి ఆలోచన అంటూ ధ్వజమెత్తారు.కోర్టుకు వెళ్లినా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చిందని చెప్పారు.
టిడ్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.పేదలకు చంద్రబాబు ఎలాంటి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్న సజ్జల ఒకవేళ ఇచ్చి ఉంటే ఎక్కడ ఇచ్చారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.







