పెళ్లి అయి విడాకులు తీసుకున్న కూడా నాగ చైతన్య( Naga Chaitanya ) సమంత( Samantha ) ల మీద మ్యాటర్ మాత్రం సోషల్ మీడియా లో రాకుండా ఉండటం లేదు ఏదో ఒక విషయం లో వీళ్లిద్దరూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.ఇక వీళ్ళ విడాకుల గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.
కానీ ఈ విషయంపై ఎప్పుడూ కూడా క్లారిటీ ఇవ్వని నాగచైతన్య కస్టడీ( Custody ) సినిమా ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చి తన విడాకుల గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు.ఇదిలా ఉంటే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ రోజు రాత్రి సమంత ఆ పని కనుక చేయకపోతే ఈరోజు ప్రస్తుతం మన ముందు వీళ్ళిద్దరూ చిలక గోరింకల్లా ఉండేవారు అంటూ ఒక వార్త నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు.అయితే అసలు విషయంలోకి వెళ్తే.
నాగచైతన్య సమంత ఇద్దరూ ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్లారట.ఆ పార్టీలో సమంత కాస్త డ్రింక్ చేసిందట.
అయితే ఇంటికి వచ్చాక ఇద్దరి మధ్య ఏదో విషయంలో చిన్న గొడవ తలెత్తిందట.అయితే ఆ గొడవ జరిగాక సమంత ఆ గొడవ విషయంలో ఇగో లకు పోయిందట.

అంతేకాదు సమంతకి ఉన్న అహంకారం వల్ల ఆ గొడవలు నాగార్జున( Nagarjuna ) వరకు తీసుకువెళ్లిందట.అయితే నాగార్జున సమంతతో ఎంత వారించినా కూడా ఫలితం లేకుండా పోయిందట.అంతే కాకుండా సమంత మద్యం మత్తులో ఉండడం వల్ల ఏం మాట్లాడుతుందో కూడా తెలియనట్లుగా ప్రవర్తించిందట.దాంతో వీరిద్దరికి ఆరోజు రాత్రి చాలానే గొడవ జరిగింది.

ఇక ఆ గొడవ తర్వాత నాగచైతన్య ఇలా కలిసి ఉండి కొట్టుకునే కంటే విడిపోయి ఎవరి దారి వారు చూసుకోవడం మేలు అంటూ ఒక డెసిషన్ కి వచ్చారట.కానీ నాగార్జున మాత్రం ఇద్దరినీ కాంప్రమైజ్ చేయడానికి చాలానే ప్రయత్నించారట.కానీ అది కుదరకపోవడంతో నాగార్జున కూడా సైలెంట్ అయ్యారట.అయితే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరొకసారి సమంత పై అక్కినేని అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు…ఇక ప్రస్తుతం సమంత సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ చాలా బిజీగా ఉంటుంది అలాగే నాగ చైతన్య కూడా తన సినిమాల్లో చాలా బిజీగా గడుపుతున్నాడు…








