సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.ఈ సినిమా సంక్రాంతి తర్వాత స్టార్ట్ అయ్యి ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ రావడంతో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కోసం వెళ్లారు.
అతి త్వరలోనే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తుంది.
ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా నుండి టైటిల్ అండ్ గ్లింప్స్ వస్తుంది అని వార్తలు వస్తూనే ఉన్నాయి.ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ పై ఇప్పుడు ఒక సమాచారం బయటకు వచ్చింది.

మహేష్ మాస్ అండ్ యాక్షన్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ జూన్ 7 నుండి నాన్ స్టాప్ గా సాగనుందని.అసలు బ్రేక్ అనేదే లేకుండా కొన్ని రోజులపాటు ఇదే షెడ్యూల్ ను కొనసాగించి మేజర్ పార్ట్ షూట్ మొత్తం పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.మరి ఇదే నిజమైతే ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేసి రిలీజ్ చేయడం ఖాయం.

ఇదిలా ఉండగా ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ( S.Radha Krishna ) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక జగపతిబాబు నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.
ఖచ్చితంగా డేట్ మార్చకుండా ఇదే డేట్ కు రిలీజ్ చేస్తామని యూనిట్ సభ్యులు ప్రామిస్ చేస్తున్నారు.







