రూపాయి చెల్లించకుండా స్మార్ట్ టీవీ(\Smart TV )నా పైగా 55 అంగుళాల స్మార్ట్ టీవీ..
మా చెవులలో పూలేమన్నా కనబడుతున్నాయా? అనే ప్రశ్నలు మీ మదిలో తలెత్తుతున్నాయని తెలుసు.అది తెలియాలంటే మీరు ఈ పూర్తి కధనం చదవసిందే మరి.థియేట్రికల్ అనుభూతిని పొందాలనుకుంటే, ఇది మీకు శుభవార్తే అని చెప్పుకోవాలి.ఓ కంపెనీ మీకు స్మార్ట్ టీవీని ఉచితంగా అందిస్తోంది.
మీరు ఇంటి కోసం ఈ టీవీని కొనవచ్చు.ఇందు కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు.
పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తే.ఆ మజానే వేరు.పెద్ద టీవీ అంటే ఎక్కువ ధర ఉంటుంది.కాబట్టి ప్రతి ఒక్కరూ అంత పెద్ద టీవీని కొనలేరు.
అయితే మీ కల ఇప్పుడు నెరవేరుతుంది.దీనికి ఓ కంపెనీ పెద్ద స్క్రీన్ టీవీలను ఉచితంగా అందజేయడమే కారణం.
అవును, 5 లక్షల మంది ఉచితంగా టీవీని పొందవచ్చు. ప్లూటో టీవీ( Pluto TV ) సహ వ్యవస్థాపకుడు ఇలియా పోజిన్ ( Ilya Pozin )ఈ విషయాన్ని తాజాగా ప్రకటించి సంచలనం అయ్యాడు.
మీరు డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ టీవీని ఉచితంగా పొందవచ్చు.దీని కోసం మీరు మీ పేరును నమోదు చేసుకోవాలి.
ముందుగా నమోదు చేసుకున్న 5 లక్షల మందికి మాత్రమే ఈ ఉచిత టీవీ లభించనుంది.ప్రస్తుతం ఈ ప్లాన్ అమెరికా మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్లు ఇవే:

55 అంగుళాల డిస్‌ప్లే కలదు.రెండో స్క్రీన్‌లో వాతావరణ అప్‌డేట్‌లు, స్పోర్ట్స్ స్కోర్‌లు, స్టాక్ మార్కెట్ అప్‌డేట్‌లు చూడవచ్చు.4K HDR థియేటర్ డిస్‌ప్లేతో వస్తుంది.ఈ టీవీకి స్మార్ట్ స్క్రీన్ దీని సొంతం.
వాయిస్ కాలింగ్, ప్రత్యక్ష వార్తలు, క్రీడలు చూడవచ్చు.శక్తివంతమైన సౌండ్ సిస్టమ్ 5 డ్రైవర్ ఇమ్మర్సివ్ సౌండ్ సిస్టమ్ కలదు.5 డ్రైవర్లు అంటే ఈ టీవీ మీకు సినిమా థియేటర్ అనుభవాన్ని అందిస్తుంది.వీడియో గేమ్‌లు, ఆర్కేడ్ క్లాసిక్‌లు, మల్టీప్లేయర్లు కలవు.‘హే టెలి‘ టీవీ… వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో వస్తుంది.ఈ టెలితో మాట్లాడటం ద్వారా ఏదైనా పనిని పూర్తి చేయవచ్చు.
అలారం సెట్ చేయమని లేదా అలారం ఆఫ్ చేయమని కూడా అడగవచ్చు.







