కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత సిఎం ఎవరనే అంశం దేశ వ్యాప్తంగా ఎంతటి చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే.సిఎం కుర్చీ కోసం సిద్దిరామయ్య, డీకే శివకుమార్ తీవ్రంగా పోటీ పడడంతో ఎవరిని సిఎం చేయాలనే దానిపై అధిష్టానం ముమ్మర కసరత్తులు చేసి చివరకు సిద్దిరామయ్యకే ( Siddha Ramaiah ) సిఎం పదవి కట్టబెట్టింది.
అలాగే డీకే శివకుమార్ ను( DK Sivakumar ) డిప్యూటీ సిఎం గా నియమించింది.అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే తనను సిఎం చేయాలని భీష్మించుకు కూర్చున్నా డీకే శివకుమార్ ఒక్కసారిగా సైలెంట్ అధిష్టానం మాటకు తలోగ్గారు.
అయితే డీకేను బుజ్జగించడంలో హస్తం హైకమాండ్ చతురత ప్రదర్శించిందనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.

కాగా గెలిచిన ఎమ్మెల్యేలతో మొదట నిర్వహించిన సిఎల్పీ సమావేశంలో మెజారిటీ ఎమ్మేల్యేలు సిద్దిరామయ్యనే సిఎం గా కోరుకున్నారు.అప్పుడు కూడా పదవి విషయంలో సైలెంట్ గా ఉన్న డీకే.ఆ తరువాత అందరికీ షాక్ ఇస్తూ తనకు సిఎం పదవి కావాలని పట్టుబట్టారు.
సిఎం పదవి ఇవ్వకపోతే.తనకు ఏ పదవి వద్దని తన వల్ల పార్టీలో చీలిక వచ్చేలా చేయకండి అని హెచ్చరించారు కూడా.
దీంతో సిఎం పదవి ఇవ్వకపోతే చీలిక తెస్తానని డీకే పరోక్షంగా చెప్పుకొచ్చారు కూడా.దీంతో ఈ ఇష్యూ కాస్త అధిష్టానం వద్దకు చేరగా.
అధిష్టానం కూడా అంతా త్వరగా తేల్చలేకపోయింది.

సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి వాళ్ళు డీకే ను బుజ్జగించే ప్రయత్నం చేసిన.ఆయన సిఎం పదవి విషయంలో వెనక్కి తగ్గలేదు.అయితే రాహుల్ చొరవతో( Rahul Gandhi ) డీకే కంప్రమైజ్ కాక తప్పలేదు.
డీకేను కూల్ చేయడంలో రాహుల్ చతురత ప్రదర్శించడాని, డీకే ను సెంటిమెంటల్ గా కూల్ చేసి డిప్యూటీ సిఎం పదవితో పాటు పీసీసీ చీఫ్ గా కూడా కొనసాగే రీతిలో డీకేను ఒప్పించడంలో రాహుల్ గాంధీ సక్సస్ అయ్యారు.దీంతో సిఎం గా సిద్దిరామయ్య, డిప్యూటీ సిఎం గా డీకే శివకుమార్ ఫిక్స్ అయ్యారు.
అయితే గతంతో పోల్చితే రాహుల్ గాంధీలో చతురత ఏ స్థాయిలో మెరుగుపడిందనడానికి.ఇదే చక్కని ఉదాహరణ అని.రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ రాజకీయ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడంలో రాటుదేలే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.







