బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శ్యామల(Anchor Syamala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె నటుడు నరసింహారెడ్డి(Narasimha Reddy)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈయన కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ, మరోవైపు పలు బిజినెస్లను కూడా చేస్తూ బిజీగా ఉన్నారు.అయితే కరోనా సమయంలో శ్యామల భర్త నరసింహారెడ్డి గురించి ఓ వార్త సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే ఈయన ఒక మహిళ దగ్గర దాదాపు కోటి రూపాయలకు పైగా డబ్బు తీసుకొని అప్పు చెల్లించమని అడిగితే తనని బెదిరిస్తున్నారని ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్యామల ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.మా ఆయన పై కేసు పెట్టిన మహిళ మరెవరో కాదని తను నాకు బాగా తెలిసిన వ్యక్తి అని శ్యామల తెలిపారు.తను ప్రతిరోజు మా ఇంట్లోనే మేము చేసిన వంట తింటూ మాతో చాలా మంచిగా ఉండేది అయితే ఆమె నా భర్త పై ఇలా అనవసరంగా చీటింగ్ కేసు పెట్టారని అయితే అది అబద్ధం అంటూ రుజువైందని శ్యామల తెలిపారు.ఇలా నేను చేసిన వంట తింటూ మాకే వెన్నుపోటు పొడిచింది అని తెలిపారు.

ఇలా వెన్నుపోటు పొడిచే వాళ్ళు మన పక్కనే ఉంటారని అందుకే మన వాళ్ళతో అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ శ్యామల తెలియజేశారు.ఇక తన భర్త గురించి ఈమె మాట్లాడుతూ ఆయన తన పని తాను చేసుకుంటూ పోతారని చివరికి నా ప్రోగ్రామ్స్ విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకోరని,తన భర్త ఎవరిని చీటింగ్ చేసే వ్యక్తి కాదు అంటూ ఈ సందర్భంగా నటుడు నరసింహారెడ్డి గురించి శ్యామల చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







