వైసీపీ మాకు శత్రువే ! ఇది చెప్పేందుకు ఏపీ బీజేపీ అవస్థలు

అకస్మాత్తుగా కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) ఏపీ అధికార పార్టీ వైసీపీపై ( YCP ) శత్రుత్వం ప్రకటించింది.గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ , ఏపీ బీజేపీ నాయకులు హడావుడి చేస్తున్నారు.

 Ap Bjp Leaders Chargesheets On Ycp Leaders Details, Ysrcp, Jagan, Ap Cm Jagan, A-TeluguStop.com

ముఖ్యంగా టిడిపి,  జనసేన చేస్తున్న విమర్శలకు వంత పాడుతూ,  సరికొత్త విమర్శలతో విరుచుకుపడుతున్నారు.అయితే ఇదంతా ఇంత అకస్మాత్తుగా చోటు చేసుకోవడానికి కారణాలు ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

ప్రస్తుతం జనసేన , టిడిపి, బిజెపిలు పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉండడంతో,

తమపై పడిన వైసిపి ముద్రను పోగొట్టుకునే పనిలో పడింది.వైసిపికి అనుకూలంగా బిజెపి నిర్ణయాలు తీసుకుంటుంది అనే విమర్శలు చాలా కాలం నుంచి వస్తుండడంతో,  ఆ ముద్ర చేరుపుకునేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుంది.

అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా, వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడుతూ,  బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే ప్రజల నుంచి అవినీతి ఆరోపణల సమాచారం సేకరించి,  వారిచ్చిన సమాచారం ఆధారంగానే వైసీపీ ప్రభుత్వం పై ఫిర్యాదులు చేయాలనే విధంగా బిజెపి ప్లాన్ చేసుకుంది.

Telugu Ap Bjp, Ap Cm Jagan, Ap, Bjp Chargisheet, Jagan, Kodali Nani, Somu Veeraj

దీనికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు చేపడుతూ, ప్రజాభిప్రాయాలు సేకరిస్తోంది.ఎక్కడికక్కడ స్థానిక నేత్రంతా ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మీద చార్జి సీట్లు దాఖలు చేస్తున్నారు.కీలకమైన నాయకులు ఉన్నచోట బిజెపి అగ్ర నేతలు స్వయంగా పాల్గొని ఈ కార్యక్రమానికి హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.గుడివాడలో కొడాలి నాని( Kodali Nani ) మీద చార్జీషీట్ దాఖలు చేసే విషయంలో బిజెపి సీనియర్ నేత, ఏపీ సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్( Sunil Deodhar ) పాల్గొన్నారు.

Telugu Ap Bjp, Ap Cm Jagan, Ap, Bjp Chargisheet, Jagan, Kodali Nani, Somu Veeraj

అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ గంజాయి విక్రయాలతో పాటు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, అవినాష్ పై రౌడీషీట్ ఓపెన్ చేసి నగర బహిష్కరణ చేయాలని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో బిజెపి స్థానిక నాయకులు ఫిర్యాదు చేశారు.ఇదే విధంగా ఎక్కడికక్కడ బిజెపి, వైసిపి ఫిర్యాదులు చేస్తూ వైసిపి విషయంలో ఎంత కఠినంగా ఉంటున్నామనే విషయాన్ని ప్రజల్లో రుజువు చేసుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తూ, తాము వైసీపీకి అనుకూలం కాదనే విషయాన్ని నేరుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ తరహా కార్యక్రమాలకు బిజెపి శ్రీకారం చుట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube