NTR Chalam: ఎన్టీఆర్ తన స్నేహితుడైన చలం ని ఎందుకు వదిలేసారు ?

రాజకీయం ఎంత పనైనా చేయిస్తుంది.అప్పటి వరకు ఉన్న మిత్రులు శత్రువులుగా కూడా మారిపోవచ్చు.

 Writer Chalam Letter To Ntr-TeluguStop.com

కానీ రాజాకీయాలు చేయడం వేరు.రాజకీయాల్లో ఉండటం వేరు.

ఆ రెండిటికి మధ్య చాలా చిన్న గీత ఉంటుంది.అది తెలుసుకోకుండా చాల మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.

ఎవరి గురించో ఎందుకండి.నందమూరి తారక రామ రావు( Nandamuri Taraka Ramarao ) గారినే ఉదాహరణగా తీసుకుంటే, ఆయన సినిమాలు వదిలేసి ప్రజాజీవితంలోకి వెళ్లి రాజకీయాల్లో క్రియాశీలకం గా మారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాక అన్ని బాగానే ఉన్నాయ్ కానీ లక్ష్మి పార్వతి( Lakshmi Parvathi ) ఎంట్రీ తో సీన్ మారిపోయింది.

Telugu Chalam, Nandamuritaraka, Ntr Chalam, Ntr, Tollywood, Writer Chalam-Movie

ఆమె ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతుందో అని చంద్రబాబు చక్రం తిప్పి ఎన్టీఆర్ ని గద్దె దింపి బాబు సీఎం అయ్యాడు.అందుకే రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు.అయితే ఇప్పుడు ఈ ఉదాహరణ చెప్పడానికి కారణం ఒకానొక టైం లో సీనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చాక అనేక మంది స్నేహితులను పక్కన పెట్టారు.అలా పక్కన పెట్టిన వారిలో రచయిత చలం( Chalam ) కూడా ఒకరు.20 ఏళ్ళ పాటు కమ్యూనిస్ట్ భావజాలంతో రచనలు చేయి సమాజంలో మార్పు కోసం ప్రయత్నించారు.శ్రీ శ్రీ ఒకవైపు చలం ఒక వైపు అనేక రచనలు చేశారు.

అయితే చలం నిజ జీవితంలో ప్రేమలో భగ్నం అయ్యారని అందరు అంటూ ఉంటారు.ప్రేమించిన అమ్మాయి అతడిని వదిలి వెళ్లడం తోనే అయన ఎన్నో ప్రేమ కవితలను, ప్రేమ ఉత్తరాలను రాస్తూ ఉండేవారని కూడా చెప్తూ ఉంటారు.

Telugu Chalam, Nandamuritaraka, Ntr Chalam, Ntr, Tollywood, Writer Chalam-Movie

ఆయన రాసిన ఉత్తరాలను బట్టి చూస్తే ప్రేమలో అయన పరిణతి కనిపిస్తుంది.సంసారం, బాధ్యతలు ఉండకూడదని అన్నిటిని వదిలి వెళ్లి చివరి రోజుల్లో అరుణాచలం లో రమణ మహర్షి ఆశ్రమం లో ఉండేవారు.అప్పుడే ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టారు.ఆశ్రమం నుంచి ఎన్టీఆర్ కి చలం ఒక లేఖ రాసారు.మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి.చేయాల్సింది చేసారు, శేష జీవితం ప్రశ్నతంగా గడుపుదాం అని తెలిపారు ఆ లేఖ లో.అయితే ఆ లేఖ కూడా ఎన్టీఆర్ చదవలేదు అని ఒక ఇంటర్వ్యూ లో లక్ష్మి పార్వతి తెలిపారు.రాజేకీయాల్లోకి వచ్చాక అందరిని వదిలేసుకున్నారు అని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube