కులం పేరుతో దూసిస్తూ మా ఇంటిని ధ్వంసం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం వి వెంకటాయపాలెంకు చెందిన మాజీ సర్పంచ్ తేజావత్ కళావతి ( Tejavath Kalavathi )డిమాండ్ చేశారు.ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం( V Venkatayapalem ) గ్రామానికి చెందిన మా మామ తేజావత్ మంగ్యాకు తేజావత్ సింగ్, తేజావత్ పంతులు ఇద్దరు కుమారులు ఉన్నారని, తన ఆస్థిని ఇద్దరు కుమారులకు సమాన వాటాలుగా పంచి ఇచ్చారని తెలిపారు.
పెద్దకొడుకు తేజావత్ సింగ్ తనకు వచ్చిన ఆస్థిని కుతుంబాక కిషోర్ కు కోటి 60లక్షలకు అమ్ముకున్నాడన్నారు.
చిన్న కొడుకు తేజావత్ పంతులుకు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు, తాను కొన్న భూమి పంతులు భూమిలో కలిసి ఉందని కుతుంబాక కిషోర్, కాపా ఆదినారాయణ, కాపా భూచక్రం, చీటీ కోటయ్య, చీటీ వెంకటి, జంగాల శ్రీనివాసరావు, పరిటాల ముత్తయ్యతో పాటు 14 మంది అగ్రకులస్తులు మా ఇంటిని ధ్వంసం చేసి, కులం పేరుతో దూషిస్తూ నన్ను, నా భర్తను, నా కొడుకును చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
ఇట్టి విషయమై రఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు( Police ) ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇంటిని ద్వంసం చేసి, కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, మాకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
ఈ విలేకరుల సమావేశంలో తేజావత్ దుర్గమ్మ, తేజావత్ సౌమిత్, భూక్య భరత్ తదితరులు పాల్గొన్నారు.