రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామస్థాయి మండల స్థాయిలో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలనే సదుద్దేశంతో నే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని మూడు రోజుల పాటు సీఎం కఫ్ 2023 క్రీడ పోటీలను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం గొప్ప విషయమని ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పకృతి వనం క్రీడా ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాకారంతో సోమ, మంగళ, బుధవారం మూడు రోజులపాటు నిర్వహించిన సీఎం కఫ్ 2023 క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు జెడ్పీటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు , ఎంపీడీవో చిరంజీవి కఫ్ , గోల్డ్ మెడల్, సర్టిఫికెట్లను , వారికి అందజేసి అభినందించారు.
అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక పండుగ వాతావరణంలో కోకో , వాలీబాల్ , కబడ్డీ , అథ్లెటిక్స్ , పరుగు పందెం పోటీలను జిల్లాలో ఎక్కడ నిర్వహించని విధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన పి ఈ టి లకు అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఎల్లారెడ్డిపేట మండలంలోని క్రీడాకారులు ఇంతటితో ఆగకుండా ఇదే స్ఫూర్తితో జిల్లా , రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో రాణించాలని సి ఎం కఫ్ కైవసం చేసుకుని రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదివరకే ఎల్లారెడ్డిపేట మండలంలో రాష్ట్రస్థాయి ఆటలాడే క్రీడకారులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు.సీఎం కఫ్ 2023 క్రీడలను చూస్తే నైపుణ్యం కలిగిన క్రీడాకారులు జిల్లా స్టేట్ లెవెల్లో ఆడే క్రీడాకారులు మన మండలంలో ఉన్నారంటే తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు.
మన మండలంలోని పి ఈ టి లతోపాటు క్రీడాకారులకు 100% తన ప్రోత్సహం ఉంటుందని క్రీడాకారుల ఖర్చులకోసం తన వంతుగా
పదివేల రూపాయల సహాయాన్ని స్టేజీ పై పిఇటీ లకు ఆయన అందజేశారు.జిల్లా , రాష్ట్ర స్థాయి లో సీఎం కఫ్ లో గెలిచి వస్తే ఇంతకు రెట్టింపు సహాయం అందజేస్తామన్నారు.
ఈ క్రీడల్లో ఓడినవారు , సెకండ్ వచ్చిన వారు ఫీల్ కావాల్సిన అవసరం లేదన్నారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, తిమ్మాపురం సర్పంచ్ రవీందర్ గుప్తా , ఎంపీటీసీ సభ్యులు వరద బాబు , ల్యాగల శ్రీనివాస్ రెడ్డి , మండల కోఆప్షన్ సభ్యులు జబ్బర్ ,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలగందుల నరసింహులు ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి , కదిరే శ్రీనివాస్ గౌడ్ , వార్డు సభ్యులు కోడుమోజు దేవేందర్ , అఫ్జల్ బాయ్ హసన్ బాయ్ , నాగుల ప్రదీప్ గౌడ్ పంచాయతీ కార్యదర్శి దేవరాజు , వివిధ గ్రామాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.