ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”పుష్ప ది రూల్”.ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసారు.
వీటికి విశేష స్పందన లభించింది.
అప్పటి నుండి ఈ సినిమా కోసం మరింత ఎదురు చూస్తున్నారు.సౌత్ కంటే కూడా నార్త్ ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సుకుమార్ కూడా ఎక్కడ అంచనాలు తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు.
ప్రజెంట్ ఈ సినిమా షూట్ గురించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
తాజాగా పుష్ప 2 సినిమాకు( Pushpa 2 ) సంబంధించిన అఫిషియల్ అప్డేట్ మేకర్స్ రివీల్ చేసారు.ఈ సినిమా కీలక షెడ్యూల్ పూర్తి అయినట్టు తెలిపారు.మరి ఈ షెడ్యూల్ లో భన్వర్ సింగ్ షెకావత్.
( Bhanwar Singh Shekhawat ) అకా ఫహద్ ఫాజిల్ పై కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసినట్టు చెబుతూ సుకుమార్ ఫహద్ సెట్స్ లో ఉన్న వర్కింగ్ స్టిల్ ను రివీల్ చేసారు.అంతేకాదు ఈసారి భన్వర్ సింగ్ మరింత పవర్ ఫుల్ గా ఉంటారని చెప్పుకొచ్చారు.
ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇక ఈ సినిమా ”పుష్ప ది రైజ్” సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది అని తెలిసిందే.మరి అంతకు మించి అనేలా సుక్కు ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాల్సిందే.