కొంత మంది హీరోలకు కేవలం కొన్ని జానర్స్ మాత్రమే సెట్ అవుతాయి,వాటిల్లోనే ఎక్కువ హిట్స్ వస్తుంటాయి, ఆ జోన్ నుండి బయటకి వచ్చి వాళ్ళు సినిమాలు చేస్తే ఫ్లాప్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి.కానీ విక్టరీ వెంకటేష్( Victory venkatesh ) విషయం లో మాత్రం అది జరగలేదు.
ఆయన ఇప్పటి వరకు అన్నీ జానర్స్ ని టచ్ చేసాడు.కామెడీ, సెంటిమెంట్ , మాస్ , లవ్ స్టోరీస్ మరియు ఫ్యామిలీ స్టోరీస్ ఇలా అన్నీ జానర్స్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న అతి తక్కువ మంది హీరోలలో ఒకడు విక్టరీ వెంకటేష్.
అందుకే 60 ఏళ్ళ వయస్సు దాటినా కూడా ఇప్పటికీ ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేస్తారు.ఈ వయస్సు లో కూడా 80 కోట్ల రూపాయలకు పైగా షేర్స్ ని టాక్ వస్తే అవలీలగా కొట్టేస్తున్నాడు.
అయితే వెంకటేష్ ఇప్పటి వరకు నేటి తరం టాప్ స్టార్ డైరెక్టర్స్ తో కలిసి పని చెయ్యలేదు.
గతం లో త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram srinivas ) దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అని అధికారికంగా ఒక ప్రకటన అయితే వచ్చింది కానీ, ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి ఆచూకీ లేదు.ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ తన డ్రీం ప్రాజెక్ట్ ‘స్వామి వివేకానంద’( Swamy Vivekananda ) బయోపిక్ అని పలు సందర్భాలలో తెలియచేసిన సంగతి తెలిసిందే.ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు చేసినా భారీ గానే చెయ్యాలని అనుకున్నాడు, అందుకే ఈ ప్రాజెక్ట్ ని రాజమౌళి( Rajamouli ) ని డైరెక్ట్ చేయాల్సిందిగా మగధీర సినిమా విడుదలైన కొత్తల్లో అడిగాడట వెంకటేష్.
రాజమౌళి చేద్దాం అన్నాడు కానీ, ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కమిట్ అయిపోయి ఉన్నాయి, ఇవన్నీ పూర్తి అయ్యాక కచ్చితంగా చేద్దాం సార్ అన్నాడట.ఆ తర్వాత రాజమౌళి బాహుబలి సిరీస్ తో బిజీ అవ్వడం, ఆ వెంటనే #RRR చెయ్యడం, ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చెయ్యబోతుండడం తో ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పట్లో లేనట్టే అని డిసైడ్ అయ్యారు వెంకటేష్ ఫ్యాన్స్.
వెంకటేష్ ఇప్పటి వరకు 85 సినిమాలు చేసాడు.ఆయన వందవ చిత్రం గా ‘స్వామి వివేకానంద’ బయోపిక్ ఉండబోతుంది, ఈ చిత్రం కి రాజమౌళి దర్శకత్వం వహిస్తాడా వంటివి తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.లేటెస్ట్ గా F3 చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని వెంకటేష్ , త్వరలోనే శైలేష్ దర్శకత్వం లో ‘సైన్ధవ్’ అనే చిత్రం ద్వారా మన ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు తమిళ హీరో ఆర్య కూడా ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు.
శ్రద్ద శ్రీనాథ్ మరియు ఆండ్రియా జరేమియా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాని శైలేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గా తమిళ నాడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన కమల్ హాసన్ ‘విక్రమ్’ రేంజ్ లో ఈ చిత్రం ఉండబోతుందని టాక్.
సోలో హీరో గా వెంకటేష్ హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది,ఈ సినిమా తో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.