మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటించిన సినిమాలలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.ముగ్గురు మొనగాళ్లు సినిమా( Mugguru Monagallu Movie ) అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కగా కె.
రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో హీరోయిన్లుగా నగ్మా, రమ్యకృష్ణ, రోజా నటించగా ఈ ముగ్గురు హీరోయిన్లకు రోజా రమణి( Roja Ramani ) డబ్బింగ్ చెప్పడం గమనార్హం.
ముగ్గురు వేర్వేరు హీరోయిన్లకు ఒక్కరే డబ్బింగ్ చెప్పడం అంటే రికార్డ్ అనే చెప్పాలి.
రోజా రమణి మాట్లాడుతూ తరుణ్ తల్లి అని నా గురించి చెప్పడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని ఆమె అన్నారు.
అప్పట్లో గ్రాఫిక్స్ లేకుండా జంతువులతో కలిసి నటించానని రోజా రమణి అన్నారు.చిరుత మీద స్వారీ చేశానని, పామును మెడలో వేసుకుని యాక్ట్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.
ఎస్పీ బాలు ఒక సందర్భంలో ప్రహ్లాదుడు అంటే నేను గుర్తుకొస్తానని చెప్పారని రోజా రమణి అన్నారు.

బాబు స్కూల్ కు వెళ్లే సమయంలో డబ్బింగ్ ఆఫర్ రాగా సుహాసినికి కంటిన్యూగా డబ్బింగ్ చెప్పానని ఆమె చెప్పుకొచ్చారు.హిందీ హీరోయిన్లు అందరికీ డబ్బింగ్ చెప్పానని రోజా రమణి అన్నారు.రోజా, రమ్యకృష్ణ, మీనాకు డబ్బింగ్ చెప్పానని రోజా రమణి పేర్కొన్నారు.
ముగ్గురు మొనగాళ్లు సినిమాలో నగ్మా, రోజా, రమ్యకృష్ణ యాక్ట్ చేశారని రాఘవేంద్రరావు గారు చెప్పడంతో ముగ్గురు హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పడం సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు.

చంటి, అల్లుడుగారు మరికొన్ని సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పానని రోజా రమణి అన్నారు.చిత్రం భళారే విచిత్రం సినిమాలో హీరో లేడీ క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పాలని కోరగా డబ్బింగ్ చెప్పానని ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని రోజా రమణి అన్నారు.రోజా రమణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.







