టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్( Vishwak sen ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరో విశ్వక్ సేన్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు.
ఇక తెలుగులో ఇప్పటివరకు
దాస్ కా ధమ్కీ, ఓరి దేవుడా, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఫలక్ నుమాదాస్
లాంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు విశ్వక్ సేన్.ఇకపోతే హీరో విశ్వక్ సేన్ చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
కాగా విశ్వక్ సేన్ ఎన్టీఆర్( Jr NTR ) కి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.

తాజాగా కూడా విశ్వక్ సేన్ సింహాద్రి రీ రిలీజ్( Simhadri movie ) ఇంట్లో భాగంగా పాల్గొని ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఒక హీరో పుట్టినరోజు సందర్భంగా ఆ హీరో 20 ఏళ్ల కిందటి నటించిన సినిమాను 1000 షోలలో ఒకేసారి విడుదల చేయడం అన్నది నిజంగా మామూలు విషయం కాదు.
నిజంగానే ఇది నేషనల్ న్యూస్.సింహాద్రి సినిమాలో మనం ఏంటో 8 కోట్ల మంది ప్రజలను అడుగు అన్న డైలాగ్ ఉంది.కానీ ఇప్పుడు అన్న గురించి అడగాలి అంటే భారతదేశం దాటి అడగాలి.ఎన్టీఆర్ అంటే అది.

సోప్రౌట్ బి నా మాస్ అమ్మ మొగుడు ఫ్యాన్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు విశ్వక్ సేన్.కాగా స్టేజ్ పై విశ్వక్ సేన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వారం రోజులుగా ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 20 ఏళ్ల కిందట ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు.దీంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈనెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇప్పటికే థియేటర్ల వద్ద భారీగా కటౌట్ లను ఏర్పాటు చేస్తున్నారు అభిమానులు.







