పవర్ స్టార్ రాజకీయాలలో పడి తాజాగా ప్రకటించిన సినిమాలు అటకెక్కుతాయని అంతా అనుకుంటే ఈయన స్పీడ్ చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.అందరిని సర్ప్రైజ్ చేస్తూ పవర్ స్టార్ వరుసగా షూటింగులతో బిజీ బిజీగా గడుపు తున్నారు.
మరి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ”ఓజి”( OG ) ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ( Director Sujeeth )దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎప్పుడో అంచనాలు పెరిగి పోయాయి.
ఇక వరుస అప్డేట్ లను అందిస్తూ మరింత పెంచేస్తున్నారు మేకర్స్.ప్రకటించిన కొద్దిరోజులకే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ముంబైలో స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి కూడా చేసారు.

ఇప్పుడు రెండవ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతున్నారు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ ( Hyderabad )లో స్టార్ట్ అవుతున్నట్టు మేకర్స్ స్వయంగా తెలిపారు.ఈ రోజు మేకర్స్ అఫిషియల్ గా ఈ న్యూస్ అందించారు.
దీంతో ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది.ఈ రెండవ షెడ్యూల్ ను ఈ రోజు నుండే హైదరాబాద్ లో స్టార్ట్ చేసినట్టు కన్ఫర్మ్ చేయడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వేరే లెవల్ లో ఉంది.
ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు.దీంతో ఫ్యాన్స్ డివివి గారిని ప్రశంసల్లో ముంచెత్తు తున్నారు.
మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.
డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







