డిజాస్టర్ అన్నారు..కానీ ఆరోజుల్లో చిరంజీవి 'మృగరాజు' కి ఎంత వసూళ్లు వచ్చాయో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కెరీర్ లో కేవలం హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ మాత్రమే కాదు, ఫ్లాప్స్ మరియు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా చాలా ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే.కానీ ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా అప్పటి తన తోటి స్టార్ హీరోల హిట్ సినిమా కంటే ఎక్కువ వసూళ్లు సాధించేవి అని ట్రేడ్ పండితులు చెప్పే మాట.చిరంజీవి అంటే అప్పట్లో ఆ రేంజ్ క్రేజ్ ఉండేది.70 ఏళ్ళ వయస్సులో కూడా ఆయన నేటి తరం స్టార్ హీరోలతో సరిసమానంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పెడుతూ, వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అలవోకగా దాటుతున్నాడు అంటే దానికి కారణం ఆయన ప్రారంభం నుండి ఏర్పాటు చేసుకున్న ఫ్యాన్ బేస్ అని చెప్పొచ్చు.చిరంజీవి సినిమా అంటే చిన్న పిల్లల దగ్గర నుండి ముసలోళ్ల వరకు సరిసమానమైన క్రేజ్ ఉంటుంది, అందుకే ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినా కూడా కమర్షియల్ గా యావరేజి రేంజ్ వసూళ్లను అయినా రాబడుతుంది మెగాస్టార్ సినిమాలు.

 Megastar Chiranjeevi Mrugaraju Movie Collections Details, Megastar Chiranjeevi ,-TeluguStop.com
Telugu Chiranjeevi, Devi Putrudu, Mrugaraju, Simha-Movie

ఇది ఇలా ఉండగా చిరంజీవి కెరీర్ లో పెద్ద డిజాస్టర్ సినిమాలు ఏమిటి అంటే మనకి గుర్తుకు వచ్చే రెండు మూడు చిత్రాల పేర్లలో ఒకటి ‘మృగరాజు’.( Mrugaraju Movie ) ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అని, మెగా ఫ్యాన్స్ కి ఆరోజుల్లో ఈ సినిమా ఒక పీడకల అని అంటూ ఉంటారు.కంటెంట్ పరంగా ఈ చిత్రం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి పెద్దగా నచ్చి ఉండకపోవచ్చు కానీ, కమర్షియల్ గా మాత్రం ఈ చిత్రానికి అప్పట్లో మొదటి వారం ఆల్ టైం రికార్డు వసూళ్లు కూడా చాలా ప్రాంతాలలో వచ్చాయి.అప్పట్లో ఈ సినిమా తో పాటుగా నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘నరసింహ నాయుడు’( Narasimha Naidu ) మరియు విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘దేవి పుత్రుడు’( Devi Putrudu ) చిత్రాలు కూడా విడుదలయ్యాయి.’నరసింహ నాయుడు’ కి ఒక రేంజ్ లో పాజిటివ్ టాక్ రాగ, మిగిలిన రెండు సినిమాలకు డిజాస్టర్ టాక్ వచ్చింది.

Telugu Chiranjeevi, Devi Putrudu, Mrugaraju, Simha-Movie

అయితే వసూళ్ల పరంగా మాత్రం నరసింహనాయుడు ఫుల్ రన్ లో మృగరాజు కంటే ఎక్కువ వసూళ్లనే సాధించింది,అందులో ఎలాంటి సందేహం లేదు.కానీ మొదటి రోజు , మొదటి వారం మరియు రెండు వారాల వసూళ్ళలో మాత్రం మృగరాజు చిత్రం కొన్ని ప్రధాన సెంటర్స్ లో ఆల్ టైం రికార్డు గ్రాస్ ని రాబట్టింది.కృష్ణ జిల్లాలో అప్పట్లో మృగ రాజు చిత్రానికి 39 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రెండు వారాల్లో వచ్చాయి, ఇది అప్పట్లో ఆల్ టైం రికార్డు, అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు వారాలకు కలిపి 40 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రెండు వారాలకు గాను 30 లక్షల రూపాయిలు వసూలు చేసింది.ఇవి ఆల్ టైం డిస్ట్రిక్ట్ రికార్డ్స్ గా చెప్పుకోవచ్చు, మొత్తం మీద ‘మృగరాజు’ చిత్రానికి అప్పట్లో ఫుల్ రన్ లో 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే , నరసింహ నాయుడు కి 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇది మెగాస్టార్ డిజాస్టర్ సినిమాకి వచ్చిన వసూళ్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube