వాట్సాప్ లో పర్సనల్ చాట్ కు లాక్.. ఈ రోజే సరికొత్త ఫీచర్ లాంచ్..!

వాట్సాప్ ( WhatsApp )సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు వినియోగదారులకు సౌకర్యాన్ని కల్పిస్తోంది.ఈ క్రమంలో పర్సనల్ చాట్ కు లాక్ పెట్టుకునే విధంగా ఓ సరికొత్త ఫీచర్ ఈ రోజే లంచ్ చేసింది.

 Lock To Personal Chat In Whatsapp.. New Feature Launch Today.. Whatsapp , Passwo-TeluguStop.com

ఈరోజు నుండే వినియోగదారులందరూ ఈ ఫీచర్ ను ఉపయోగించడం ప్రారంభించవచ్చు.ఇకపై తమ పర్సనల్ చాట్ ఇతరులు చూస్తారు అని భయం లేకుండా ఎంచక్కా లాక్ చేసుకుని హాయిగా ఉండవచ్చు.

అంతేకాకుండా పర్సనల్ చాట్ కు వాట్సాప్ అత్యంత భద్రత కూడా కల్పిస్తుంది.ఈ ఫీచర్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం.

ముందుగా వాట్స్అప్ ఓపెన్ చేసి, ఏఏ నెంబర్లతో పర్సనల్ చాట్( Personal chat ) చేయాలి అనుకుంటున్నారో ఆ నెంబర్లను ఎంచుకోవాలి.తరువాత మీ చాట్ ప్రొఫైల్ చిత్రం పక్కన ఉన్న వ్యక్తి లేదా గ్రూప్ పేరును క్లిక్ చేయాలి.ఇప్పుడు స్క్రోల్ చేసి క్రిందికి వెళితే అక్కడ లాక్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.జస్ట్ ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తే చాలు.ఇక పర్సనల్ చాట్ చేసే నెంబర్లకు లాక్ అనేది పాస్వర్డ్ రూపంలో లేదా వేలిముద్ర రూపంలో సెట్ చేసుకోవచ్చు.

తరువాత పర్సనల్ చాట్ లాక్ తెరవాలంటే పాస్వర్డ్ ( Password )లేదా వేలిముద్ర ఉపయోగించాల్సి ఉంటుంది.తద్వారా మీ పర్సనల్ చాట్ ఇతరులు తెరిచి చదవడం వీలు కాదు.కాబట్టి మీరు లాక్ చేసిన తర్వాత, ఆ చాట్ మెసేజ్ ల యొక్క నోటిఫికేషన్లు కూడా దాచబడి ఉంటాయి.

మీ పర్సనల్ చాట్ కు రక్షణ ఉంటుంది.ప్రస్తుతం ఈ ఫీచర్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి వినియోగదారుడు కి ఉపయోగపడుతుందని వాట్సప్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube