పొంగులేటి కన్ఫ్యూజన్ లోనే ఉన్నారా ? 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేత ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Former MP Ponguleti Srinivas Reddy ) పొలిటికల్ జర్నీ ఏ వైపు గా సాగుతుందనేది ఎవరికి అంతు పట్టడం లేదు.ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీలో చేరాలి రాజకీయంగా,  ఏ స్టెప్ తీసుకోవాలనే విషయంలో బాగా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నారు.

 Are Ponguleti Confused, Ponguleti Srinivasareddy , Brs, Telangana, Jupalli Krish-TeluguStop.com

బీఆర్ఎస్( BRS ) కు దూరమైన తర్వాత కాంగ్రెస్ బిజెపిలలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది.అదే సమయంలో పొంగులేటి సొంత పార్టీ పెడుతున్నారని, ఇప్పటికే  ఆ పార్టీ పేరు బీఆర్ఎస్ పేరుతో రిజిస్టర్ చేయించారని ప్రచారం జరుగుతుంది.

ఈ వ్యవహారం ఇలా ఉండగానే కాంగ్రెస్ , బిజెపికి( Congress , BJP ) చెందిన కీలక నాయకులు పొంగులేటిని తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు .అయితే ఆయన మాత్రం తన నిర్ణయం ఏమిటనేది చెప్పకుండానే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, తెలంగాణలోని తన అనుచరుగణం ఉన్న ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ,  భవిష్యత్తు కార్యాచరణ పై తన అనుచరులతో చర్చిస్తున్నారు.

-Politics

అయితే చాలాకాలంగా దీనిపై చర్చలు జరుగుతున్న కీలక నిర్ణయం మాత్రం పొంగులేటి తీసుకోకపోవడంతో ఆయన అనుచరులు అయోమయానికి గురవుతున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ప్రభావం చూపించగల ఆర్థిక అంగ బలం ఉన్న పొంగులేటిని చేర్చుకోవడం ద్వారా తమ పార్టీలకు కలిసి వస్తుందని బిజెపి కాంగ్రెస్ లు ప్రయత్నాలు చేస్తున్నాయి బి ఆర్ ఎస్ ను దెబ్బ కొట్టేందుకు పొంగులేటి సాయం ఎంతో అవసరం అని పార్టీలు భావిస్తుండడంతోనే ఆయనకు ఎంతగా డిమాండ్ పెరిగిపోయింది ఇక కొత్తగూడెంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పొంగులేటి మిత్రుడు మహబూబ్నగర్ ( Mahbubnagar )జిల్లాకు చెందిన సీనియర్ పొలిటిషన్ జూపల్లి కృష్ణారావు కూడా ఆయనకు మద్దతు పలికారు ఏ ఇద్దరు కీలక నాయకులు కావడంతో మీరు రాజకీయంగా ఏ స్టెప్ తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.ఈ విషయం లో ఇప్పటికే బీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది.పొంగులేటితో పాటు,  జూపల్లి కృష్ణారావు కదలికలపై నిఘా పెట్టిందట.

-Politics

పొంగులేటి జూపల్లి వెంట వెళ్లే బీఆర్ఎస్ నాయకులు ఎవరు ? వారు ఏ పార్టీలో చేరబోతున్నారు ? వారికి ఎటువంటి ప్రాధాన్యం దక్కబోతోంది అనే అనేక అంశాలపై ఆరా తీస్తున్నారట.తొందరపడి తప్పటడుగులు వేయకూడదనే అలోచనలో పొంగులేటి ఉన్నారట.అయితే బిజెపి ,కాంగ్రెస్, సొంత పార్టీలలో ఏది బెటర్ అనే విషయంలోనే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube