SSMB28 : 90 రోజుల సమయం మాత్రమే.. ఈ లోపు పూర్తి చెయ్యకపోతే?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.ఈ సినిమాకు సంబంధించిన రెగ్యురల్ షూట్ జనవరిలోనే స్టార్ట్ అయ్యింది.కానీ మధ్య మధ్యలో బ్రేకులు అయితే తప్పడం లేదు.అందుకు కారణం త్రివిక్రమ్ మహేష్ ను మెప్పించక పోవడమే అని టాక్.

 Trivikram And Team Are Unhappy With Mahesh Babus Overthinking-TeluguStop.com

అయితే ఈ సినిమా విషయంలో మహేష్ కూడా షరతులు బాగా పెడుతున్నాడట.ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో నాన్ స్టాప్ లాంగ్ షెడ్యూల్ లో అయిన సరే 90 రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని లేకపోతే సినిమాను ఆపేద్దాం అని మహేష్ కండిషన్ పెట్టారట.

మరి ఈ కండిషన్ కు త్రివిక్రమ్ లాంగ్ షెడ్యూల్ అంటే ఆర్టిస్టుల కాల్ షీట్స్ కూడా దొరకాలి కదా అని అన్నారట.

Telugu Jagapathi Babu, Mahesh Babu, Pooja Hegde, Sreeleela, Ssmb, Trivikram-Movi

అయితే జూన్ లో అందరి కాల్ షీట్స్ 90 రోజులకు సరిపడా దొరకడంతో ఈ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.మొత్తానికి మహేష్ కండిషన్స్ తో త్రివిక్రమ్( Trivikram ) కు మరింత ఒత్తిడి తెస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తారని ఒకటి నెగిటివ్ షేడ్ అని కూడా ప్రచారం సాగుతుంది.

Telugu Jagapathi Babu, Mahesh Babu, Pooja Hegde, Sreeleela, Ssmb, Trivikram-Movi

ఇదిలా ఉండగా మే 31న ఈ సినిమా నుండి అదిరిపోయే టైటిల్ అప్డేట్ ఉండబోతుంది అని సమాచారం.ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక జగపతిబాబు( Jagapathi Babu ) నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube