SSMB28 : 90 రోజుల సమయం మాత్రమే.. ఈ లోపు పూర్తి చెయ్యకపోతే?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''SSMB28''.

ఈ సినిమాకు సంబంధించిన రెగ్యురల్ షూట్ జనవరిలోనే స్టార్ట్ అయ్యింది.కానీ మధ్య మధ్యలో బ్రేకులు అయితే తప్పడం లేదు.

అందుకు కారణం త్రివిక్రమ్ మహేష్ ను మెప్పించక పోవడమే అని టాక్.అయితే ఈ సినిమా విషయంలో మహేష్ కూడా షరతులు బాగా పెడుతున్నాడట.

ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో నాన్ స్టాప్ లాంగ్ షెడ్యూల్ లో అయిన సరే 90 రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని లేకపోతే సినిమాను ఆపేద్దాం అని మహేష్ కండిషన్ పెట్టారట.

మరి ఈ కండిషన్ కు త్రివిక్రమ్ లాంగ్ షెడ్యూల్ అంటే ఆర్టిస్టుల కాల్ షీట్స్ కూడా దొరకాలి కదా అని అన్నారట.

"""/" / అయితే జూన్ లో అందరి కాల్ షీట్స్ 90 రోజులకు సరిపడా దొరకడంతో ఈ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

మొత్తానికి మహేష్ కండిషన్స్ తో త్రివిక్రమ్( Trivikram ) కు మరింత ఒత్తిడి తెస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తారని ఒకటి నెగిటివ్ షేడ్ అని కూడా ప్రచారం సాగుతుంది.

"""/" / ఇదిలా ఉండగా మే 31న ఈ సినిమా నుండి అదిరిపోయే టైటిల్ అప్డేట్ ఉండబోతుంది అని సమాచారం.

ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక జగపతిబాబు( Jagapathi Babu ) నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.

చైతన్య శోభిత తొలిసారి అప్పుడే కలిశారట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?