నంద్యాలలో టీడీపీ నేతలు భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వివాద ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
నంద్యాల ఘటనపై సీనియర్లతో త్రిసభ్య కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు.ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యక్రమాల్లోకి చొరబడి ఘర్షణలకు పురిగొల్పుతున్నారని ఆరోపించారు.
ఇలాంటి వాటి పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.అదేవిధంగా నేతలు పూర్తి సమన్వయంతో వ్యవహారించాలని వెల్లడించారు.