దేశంలో రోజురోజుకు ఖర్చులు పెరుగుతున్నాయి.పదవీ విరమణ అనంతరం పింఛను సదుపాయం లేక కష్టాలు పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది.
పొదుపు చేయకపోవడం వల్ల పదవీ విరమణ అనంతరం ఇబ్బందులు పడుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.సొంతిల్లు ఉండి వృద్ధాప్యంలో అదనపు ఆదాయం కావాలని కోరుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఒక అద్భుతమైన స్కీమ్ ఉంది.
రివర్స్ మార్టిగేజ్ స్కీమ్( Reverse mortgage scheme ) పేరుతో అమలవుతున్న ఈ స్కీమ్ వృద్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.2007 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ అమలవుతుండగా ఈ స్కీమ్ గురించి సరైన అవగాహన లేక చాలామంది ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.బ్యాంకులు సైతం ఈ స్కీమ్ గురించి పెద్దగా ప్రచారం చేసుకోకపోవడం గమనార్హం.
వృద్ధాప్యంలో పోషణకు ఎలాంటి ఆదాయం లేని వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.
నివాస యోగ్యమైన గృహంపై తీసుకునే రుణాన్ని రివర్స్ మార్ట్ గేజ్ అంటారు.రివర్స్ మార్ట్ గేజ్ లో రుణం తీసుకున్నవారికి నెలవారీ బ్యాంక్ నుంచి కొంత మొత్తం అందుతుంది.
ఇంటి విలువ, ఇల్లు ఉండే ప్రాంతాన్ని బట్టి ఈ రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఇంటి విలువలో 60 శాతం నుంచి 80 శాతం వరకు రుణంగా పొందవచ్చు.20 ఏళ్ల కాలానికి గరిష్టంగా కోటి రూపాయల వరకు ఈ రుణంను మంజూరు చేస్తారు.ఈ స్కీమ్ లో ఇంటి యజమాని మరణించిన తర్వాత ఇల్లు బ్యాంక్ పరం అవుతుంది.
భార్యాభర్త కలిసి రుణం తీసుకుంటే వాళ్లిద్దరి మరణం తర్వాతే బ్యాంక్ కు ఆ ఇంటిపై హక్కులు ఉంటాయి.రుణం తీసుకున్న వ్యక్తి మరణం తర్వాత వారసులు రుణం, వడ్డీ( Loan , interest ) చెల్లించి ఇంటిని పొందవచ్చు.
వాళ్లకు రుణం చెల్లించడం ఇష్టం లేకపోతే బ్యాంక్ ఆ ఇంటిని వేలం వేసి బకాయిలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని వారసులకు ఇస్తుంది.

రుణం, వడ్డీ కంటే తక్కువ మొత్తానికి ఇల్లు విక్రయిస్తే బ్యాంక్ నష్టాల కింద సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంది.వారసులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.20 ఏళ్ల పాటు మాత్రమే బ్యాంక్ నెలవారీ ఈ.ఎం.ఐ రూపంలో రుణం తీసుకున్న వాళ్లకు చెల్లించడం జరుగుతుంది.రూపాయి కూడా బ్యాంక్ కు లోన్ చెల్లించకుండా ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు.సమీపంలోని బ్యాంక్ ను సంప్రదించి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.








