76 రోజులుగా సముద్రగర్భమే అతని నివాసం.. బయటకు రావాలని లేదట!

ఈ భూమిమీద అంతగా సేఫ్ కాదని నిర్ణయించుకున్నాడో ఏమోగానీ, అమెరికాలో ఒక ప్రొఫెసర్ ఏకధాటిగా వంద రోజుల పాటు నీటి అడుగున నివసించి సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యారు.ఆయనే ప్రొఫెసర్ జోసెఫ్ డిటురి( Professor Joseph Deturi ).

 For 76 Days, His Home Is Under The Sea He Doesn't Want To Come Out, For 76 Days-TeluguStop.com

ఈపాటికే ఆయన 76 రోజులుగా సముద్రపు నీటి అడుగున నిర్మించిన నివాసంలో జబర్దస్త్( Jabardasth ) గా ఉంటున్నారు.ఈ క్రమంలో గతంలో ఉన్న రికార్డులను ఈపాటికే ఆయన బద్దలు కొట్టారు.2014లో ఇద్దరు ప్రొఫెసర్లు బ్రూస్ కాంట్రెల్ మరియు జెస్సికా ఫెయిన్( Jessica Fein ).73 రోజుల పాటు నీటిలో అడుగున జీవించి రికార్డు నెలకొల్పారు.

Telugu Days, Doesnt, Professorjoseph, Sea-Latest News - Telugu

ఈ నేపథ్యంలో, వారి రికార్డును ప్రొఫెసర్ జోసెఫ్ డిటురి బద్దలు కొట్టడం విశేషం.ఇకపోతే అమెరికాలోని ఫ్లోరిడాలో కీ లార్గోలో సముద్ర జలాల్లో 30 అడుగుల కిందన స్కూబా డైవర్స్ కోసం నిర్మించిన ఆవాసంలోకి జోసెఫ్ డిటురి ఈ సంవత్సరం మార్చి 1న ప్రవేశించారు.ఈ క్రమంలో 76 రోజులుగా నీటి అడుగున క్షేమంగా జీవించారు.ఈ క్రమంలో బ్రూస్ కాంట్రెల్ జెస్సికా ఫెయిన్( Bruce Cantrell Jessica Fein ) రికార్డును జోసెఫ్ డిటురి బ్రేక్ చేయడం జరిగింది.

అంతేకాకుండా 100 రోజులు పూర్తైన తర్వాతే అంటే జూన్ 9నే బయటకు వస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.

Telugu Days, Doesnt, Professorjoseph, Sea-Latest News - Telugu

సముద్రం అడుగున తన ఆవాసంపై పీడనాన్ని తగ్గించే సాంకేతిక ఏర్పాట్లేవీ లేకుండానే జోసెఫ్ డిటురి అక్కడ ఉండగలగడం విశేషమే అంటున్నారు వైద్య నిపుణులు.విద్య వైద్య సముద్ర పరిశోధనల్లో భాగంగా నీటి అడుగున నివసించే వసతిని ‘మెరైన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఫౌండేషన్’( Marine Resources Development Foundation ) ఈ ఏర్పాటు చేయడం గమనార్హం.తీవ్రమైన ఒత్తిళ్లకు మానవ శరీరం ఎలా స్పందిస్తుందన్న అంశంపై పరిశోధనలో భాగంగానే తాను సముద్రపు అడుగున నివసిస్తున్నట్టు ప్రొఫెసర్ డిటురి చెబుతున్నారు.

నీటి అడుగున ఉన్న నివాసం నుంచే ఆయన సౌత్ ఫ్లోరిడా వర్సిటీ విద్యార్థులు 2500 మందికి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube