Sudha Murty : సల్మాన్ ఖాన్ లో అది చాలా స్పెషల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుధామూర్తి?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman khan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సల్మాన్ ఖాన్.

 Sudha Murty Says Salman Khan Has A Childlike Innocence And Fit For Bajrangi Bha-TeluguStop.com

ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇటీవలే కిసి కా భాయ్ కిసి కా జాన్( Kisi Ka Bhai Kisi Ki Jaan ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

సల్మాన్ ఖాన్ కు కేవలం నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే తాజాగా హీరో సల్మాన్ ఖాన్ పై పద్మశ్రీ సుధా మూర్తి ( sudha murthy )చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా సుధా మూర్తి సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ.కపిల్ శర్మ షో లో పాల్గొన్న సుధా మూర్తి సల్మాన్ ఖాన్ ముఖంలో పసితనం కనిపిస్తుందని, అందుకే భజరంగి భాయ్‌జాన్( Bajrangi Bhaijaan ) మూవీలో ఆ పాత్రకు సల్మాన్ ఖాన్ అన్ని రకాలుగా అర్హులు అని కామెంట్ చేసింది.ఇదే విషయాన్ని తన కుమార్తెకు కూడా చెప్పినట్లు తెలిపారు.

ఆ పాత్రను సల్మాన్ ఖాన్ మినహా మరెవరూ పోషించలేరని అని చెప్పుకొచ్చారు సుధా మూర్తి.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవ్వడంతో సల్మాన్ ఖాన్ అభిమానులు ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేయడంతో పాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇదే షోలో మరో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ను దిలీప్ కుమార్‌తో పోల్చారు సుధా మూర్తి.చిన్న తనంలో తనకు దిలీప్ కుమార్ మూవీస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు.

దిలీప్ కుమార్ తరహాలో ఎమోషన్స్ పండించగల సామర్థ్యం షారుఖ్‌కి ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube