మెగా డాటర్ శ్రీజ( Sreeja ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) కుమార్తెగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే అయితే శ్రీజ గత కొద్ది కాలంగా తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
శ్రీజ తన రెండవ భర్త కళ్యాణ్ దేవ్ ( Kalyan Dev) కి విడాకులు ఇచ్చారని ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీజ తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు అనే విషయం మనకు తెలిసిందే.అయితే శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకులు( Divorce ) తీసుకొని విడిపోయారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా ఇప్పటివరకు ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఏవిధంగాను స్పందించలేదు.

శ్రీజ ఇంట్లో వారికి తెలియకుండా ఓ వ్యక్తిని ప్రేమించి తనని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చారు.అయితే అతనితో వచ్చిన మనస్పర్ధలు కారణంగా శ్రీజ విడాకులు తీసుకున్నారు.ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన ఈమె కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తి కళ్యాణ్ దేవ్ ను రెండవ వివాహం చేసుకున్నారు.ఇలా శ్రీజ కళ్యాణ్ దేవ్ దంపతులకు మరొక అమ్మాయి జన్మించారు.
ఇలా ఇద్దరు బిడ్డలు జన్మించిన తర్వాత ఈమె తన రెండవ భర్తతో కూడా విడాకులు తీసుకొని విడిపోయారని తెలుస్తుంది.

ఇలా కూతురి విడాకుల వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నప్పటికీ చిరంజీవి మాత్రం ఇంతవరకు ఎక్కడా ఎప్పుడూ కూడా స్పందించలేదు.అయితే చిరంజీవి తల్లి అంజనా దేవి( Anjana Devi ) ఇచ్చిన సలహాతో శ్రీజ విషయంలో కాస్త బెంగ తగ్గిందని తన సన్నిహితుల వద్ద చిరంజీవి తెలియజేశారనీ సమాచారం.శ్రీజ వ్యక్తిగత విషయంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయని శ్రీజ వాళ్ళ నాన్నమ్మకు చెప్పారట.
అయితే తన నాన్నమ్మ మాత్రం శ్రీజకు సలహా ఇస్తూ జీవితం అంటే ఒక వ్యక్తితో అయిపోదు.నిన్ను కంట్రోల్ చేసి బాధ పెట్టే వాళ్లకు నువ్వు దూరంగా ఉండు.
నీ మనసుకు ఏది అనిపిస్తే అది నువ్వు చెయ్యి అంటూ శ్రీజకు తన నాన్నమ్మ అంజనా దేవి సలహా ఇచ్చారట తన తల్లి ఇచ్చిన సలహాతో చిరంజీవికి కూడా కాస్త ప్రశాంతంగా ఉందంటూ చిరంజీవి తన సన్నిహితుల దగ్గర తెలియచేసారనీ సమాచారం.







