టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి ( SS Rajamouli ) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్( RRR ).ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలోని నాటునాటు పాటకు ( Naatu Naatu Song )గాను ఆస్కార్ అవార్డు( Oscar Award ) కూడా వచ్చిన విషయం తెలిసిందే.ఇలా ఆస్కార్ అవార్డు రావడం ఇండియన్ సినిమాకి ఎంతో గర్వకారణం అని చెప్పాలి.
ఇక ఈ సినిమాని చూసిన ఎంతోమంది హాలీవుడ్ దర్శకులు సైతం సినిమా కురిపించారు.
ఇలా ఒక ఇండియన్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి మంచి గుర్తింపు సంపాదించుకొని ఆస్కార్ అవార్డు గెలుచుకుంటే ఈ సినిమా చూసే టైం నాకు లేదంటూ బాలీవుడ్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు యాంకర్ ప్రశ్నిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా చూశారా అంటూ ప్రశ్నించారు.అయితే ఈ ప్రశ్నకు ప్రియాంక చోప్రా సమాధానం చెబుతూ ఆర్ఆర్ఆర్ సినిమా చూసే అంత టైం నాకు లేదని కామెంట్ చేశారు.
సాధారణంగా తాను టీవీ షోలో ఎక్కువగా చూస్తానని సినిమాలు చూడనని తెలిపారు.
ఇలా ప్రియాంక చోప్రా ఆర్ఆర్ఆర్ సినిమా చూసే అంత టైం నాకు లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఈమె పై భారీ ట్రోలింగ్స్ మొదలయ్యాయి.హీరోయిన్ అయ్యుండుకొని ఒక సినిమా చూడటానికి కనీసం మూడు గంటల సమయం కేటాయించలేరా అంటూ కొందరు కామెంట్స్ చేయగా మరికొందరు ఇండియన్ సినిమాకి ఎంతో గర్వకారణంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా చూసే టైం లేకపోవడం ఏంటి విడ్డూరం కాకపోతే అంటూ కామెంట్ లు చేస్తున్నారు.అయితే ఆస్కార్ ప్రమోషన్లలో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం అమెరికా వెళ్ళగా అక్కడ వారందరికీ ప్రియాంక చోప్రా ఆతిథ్యం ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.
అందరికీ ఆతిథ్యం ఇచ్చిన ఈమె ఈ సినిమా చూడకపోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.