పవన్ పై మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన అధికార పార్టీ ?? పవన్ లొంగుతారా?

రాష్ట్రంలో త్రిముఖ పోరుకు చాన్సే లేదని ద్విముఖ పోరే ఉంటుందని , తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ పై వైసీపీ( YCP ) శ్రేణులు గత కొన్ని రోజులుగా తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి.ఆ పొత్తు పెటాకులు అయ్యే దిశగా మైండ్ గేమ్ స్టార్ట్ చేశాయా అంటే అవుననే సమాధానం వస్తుంది.జనసేన+ టిడిపి ( Jana sena )కాంబినేషన్ కచ్చితంగా విన్నింగ్ కాంబినేషన్ అని, దీనికి 100% సక్సెస్ రేట్ ఉంటుందని పొలిటికల్ అనలిస్ట్ లు అందరూ విశ్లేషిస్తున్న దరిమిలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పొత్తును ఫెయిల్ చేయడానికి అదికార పార్టీ తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను చూస్తుంటే అర్థమవుతుంది.సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై సవాలు చేశారంటే పరిస్థితి సీరియస్ గానే ఉందని అర్థం అవుతుంది .

 Ycp Playing Mind Game With Pawan Klayan , Ycp , Pawan Klayan, Janasena, Ys Jaga-TeluguStop.com
Telugu Ap, Chandra Babu, Janasena, Pawan Klayan, Ys Jagan-Telugu Political News

ఇంతకాలం పవన్ను ఆయన సామాజిక వర్గ నేతలతో మాత్రమే తిట్టించి ఊరుకున్న వైసీపీ అధిష్టానం ,ఈసారి డైరెక్ట్ అటాక్ చేసింది .ఎన్నిక కొ రేటు పెట్టి ప్యాకేజీ తీసుకోవడమే తప్ప ప్రజాక్షేమం పట్టని పార్టీ అని, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టే దమ్ము లేక పొత్తుల గురించి మాట్లాడుతున్నారని ,పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం వారికి కామనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్ .తన స్థాయి ని తగ్గించుకుని, పవన్( Pawan klayan ) ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరీ వ్యాఖ్యలు చేయడం వెనక ఆయనను రెచ్చగొట్టి పొత్తుని విఫలం చేయాలన్న వ్యూహం ఉందని పొలిటికల్ ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu Ap, Chandra Babu, Janasena, Pawan Klayan, Ys Jagan-Telugu Political News

ఇప్పటికే కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి పవన్ కు వ్యతిరేకంగా వారు పనిచేసేలా వ్యాఖ్యలు చేస్తున్న వైసిపి నాయకులు ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏదో ఒక కోణంలో ఈ పొత్తును ఫెయిల్ చేయాలనే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే పొత్తుపై జనసేన ఇంత స్పష్టంగా ప్రకటనలు ఇస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పొత్తు కు అనుకూలంగా కానీ పవన్ కు మద్దత్తు గా కానీ తెలుగుదేశం నాయకులు ఏ విదమైన వ్యాఖ్యలుచేయకపోవడం జనసైనికులకు కోపం తెప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది.అవసరం తెలుగుదేశం దైనా ఈ పొత్తు ద్వారా మెజారిటీ ప్రయోజనం పొందే పార్టీ తెలుగుదేశం అయినా కూడా పవన్ పై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో కానీ ఆయనకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడంలో కానీ తెలుగుదేశం సోషల్ మీడియా కానీ ఆ పార్టీ నాయకులు గాని ముందుకు రాకపోవడం హార్డ్ కోర్ జనసేన అభిమానులను ఇబ్బంది పెడుతుందని తెలుస్తుంది ఈ దిశగా వారి సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube