'సలార్' ఇంటర్వెల్ సన్నివేశం కోసం 35 కోట్లు..చరిత్రలో ఇదే తొలిసారి

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన ‘ఆది పురుష్’ చిత్రం జూన్ 16 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది మూవీ టీం.ఈ చిత్రానికి కంటే కూడా ప్రభాస్ అభిమానుల నుండి ప్రేక్షకుల వరకు ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’.

 Prabhas Director Prasanth Neel Salaar Movie Interval Scene Details, Prabhas, Dir-TeluguStop.com

( Salaar ) ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ కి ప్రశాంత్ నీల్( Prasanth Neel ) లాంటి డైరెక్టర్ దొరికితే ఇక బాక్స్ ఆఫీస్ విధ్వసం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం ఎవరి తరం కాదు.ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నీ 10 రోజుల వ్యవధి లో లేచిపోతాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ కాంబినేషన్ కి ఉన్న పవర్ అలాంటిది మరి.రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.

Telugu Prasanth Neel, Shruti Hasan, Hombale, Prabhas, Salaar, Salaarinterval-Mov

అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశం ప్రభాస్ కెరీర్ లోనే బెస్ట్ గా ఉండబోతుందట.ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ ఇంటర్వెల్ సన్నివేశాన్ని బీట్ చెయ్యడం అంటే సాధారణమైన విషయం కాదు.ఎందుకంటే ఆయన సినిమాల్లోని ఇంటర్వెల్ సన్నివేశాలు ఒకదానిని మించి ఒకటి ఉంటాయి.ఛత్రపతి , రెబల్ ,మిర్చి మరియు బాహుబలి సిరీస్ లో ఇంటర్వెల్ సన్నివేశాలు ప్రభాస్ కెరీర్ లో మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే ది బెస్ట్ సన్నివేశాలు అని చెప్పొచ్చు.

కేవలం ఈ సన్నివేశం కోసమే 35 కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట.రీసెంట్ గానే ఈ సన్నివేశం చిత్రీకరణ పూర్తి అయ్యింది.దీంతో ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని అంటున్నారు, ఈ ఏడాది సెప్టెంబర్ 21 వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.రీసెంట్ గానే ఈ చిత్రం విడుదల తేదీ పై అభిమానుల్లో గందరగోళం ఎదురైంది.

Telugu Prasanth Neel, Shruti Hasan, Hombale, Prabhas, Salaar, Salaarinterval-Mov

ఈ చిత్రం విడుదల తేదీని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో పెను దుమారమే రేపింది.అభిమానులు ‘హోమబుల్ మూవీస్’ బ్యానర్ ని ట్యాగ్ చేసి రచ్చరచ్చ చేసేసారు.ఫ్యాన్స్ రియాక్షన్ చూసి వెంటనే మేకర్స్ రెస్పాన్స్ ఇస్తూ, సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ ని చూసి మోసపోకండి, ‘సలార్’ చిత్రం ఈ సెప్టెంబర్ 21 వ తేదీన విడుదల కాబోతుంది అంటూ మరోసారి అభిమానులకు గుర్తు చేసి ,రూమర్స్ కి చెక్ పెట్టారు.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటించాడు.

జగపతి బాబు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు, ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి చేశారట.ఇక ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల కాబోతుంది అంటూ గత కొంత కాలం నుండి ప్రచారం అవుతున్న వార్త.

ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube