భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు.. భార్యకు కరెంట్ షాక్ పెట్టిన భర్త..!

సంసారంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం.భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

 Husband Gave Current Shock To Wife In Rangareddy District Details, Husband ,curr-TeluguStop.com

అలాకాకుండా అనుమానాలను పెంచుకోవడం, సర్దుకుపోయే గుణం లేకపోవడం వల్ల కుటుంబాలు నాశనం అయ్యి రోడ్డున పడుతున్నాయి.ఓ భర్త తన భార్యపై కోపంతో కరెంట్ షాక్( Current Shock ) పెట్టి ప్రాణాలు తీశాడు.

ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో( Rangareddy District ) చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ లో యాదయ్య, కవిత దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి వివాహం జరిగి చాలా సంవత్సరాలే అయింది.

చాలా కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది.కానీ గత కొన్ని రోజులుగా ఈ దంపతుల మధ్య చిన్నచిన్న కారణాలకే గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి.

ఇక ప్రతిరోజు ఏదో ఓ చిన్న కారణంతో భార్యాభర్తలిద్దరూ గొడవపడేవారు.ఈ క్రమంలో ఇటీవలే భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమై కాసేపు మాటలు యుద్ధం జరిగింది.

Telugu Shock, Yadaiah, Ranga, Kavitha-Latest News - Telugu

యాదయ్య( Yadaiah ) క్షణికావేశంలో తనను తాను కంట్రోల్ చేసుకోలేక భార్యకు కరెంట్ షాక్ పెట్టాడు.భార్య కవిత షాక్ తగలడంతో క్షణాల్లో ప్రాణాలు విడిచింది.ఈ విషయం కవిత తల్లిదండ్రులకు, బంధువులకు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపించి, స్థానిక పోలీస్ స్టేషన్లో యాదయ్య పై ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Telugu Shock, Yadaiah, Ranga, Kavitha-Latest News - Telugu

నిందితుడు యాదయ్య ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాజాగా జరిగిన ఈ ఘటన కొందుర్గ్ లో తీవ్ర కలకలం రేపింది.స్థానికులు అన్యాయంగా ప్రాణాలు తీసే ఇటువంటి కిరాతకులను దారుణంగా శిక్షించాలని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.క్షణికావేశంలో ఆ కారణంగా భార్య ప్రాణాలు తీసే ఇటువంటి కిరాతకులకు కఠిన శిక్ష విధిస్తే.

సమాజంలో ఇలాంటి ఘటనలు తగ్గే అవకాశాలు ఉన్నాయని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube