ఓ దొంగ ( Thief ) ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ ఇంట్లో దొంగతనానికి వెళ్లి కాస్టలీ మందు బాటిల్స్( Wine Bottles ) కనిపించగానే ఫుల్ గా తాగేసి బెడ్ రూమ్ లో ఒళ్లు మరచి నిద్రపోయాడు.తరువాత ఇంటి యజమాని ఎంత ప్రయత్నించినా నిద్ర లేవలేదు.
ఇక మద్యం పూర్తిగా దిగిపోయాక కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఇంటి యజమానితో పాటు కుటుంబ సభ్యులు కనిపించడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు.కుటుంబ సభ్యులు దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
దొంగ దొరికినా కూడా ఇంట్లో విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి.అసలు ఏం జరిగిందో చూద్దాం.
వివరాల్లోకెళితే.బీహార్ లోని( Bihar ) ఛాప్రా కు చెందిన శర్వానంద్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు.ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలోని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో శర్వానంద్ నివాసం ఉంటున్నాడు.అయితే వివాహ వేడుక కోసం శర్వానంద్ కుటుంబం బంధువుల ఇంటికి వెళ్ళింది.ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దొంగలు శర్వానంద్ ఇంట్లో చోరీకి పాల్పడి 100 గ్రాముల బంగారం, రూ.1.5 లక్షల విలువైన వెండి, రూ.50 విలువైన ఖరీదు పట్టు చీరలు, కొన్ని విలువైన డాక్యుమెంట్లతో పాటు రూ.6 లక్షల నగదు చోరీకి గురయ్యాయి.

పెళ్లి నుండి శర్వానంద్ కుటుంబం ఇంటికి రాగానే ఇంట్లో ఉండే వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో పాటు బెడ్ రూమ్ లో గుర్తు తెలియని వ్యక్తి గాఢ నిద్రలో ఉండడం చూశారు.ఆ వ్యక్తిని నిద్రలేపే ప్రయత్నం చేయగా అతను మద్యం మత్తులో ఉండడంతో నిద్ర లేపడం కష్టమైంది.కాసేపటి తరువాత మద్యం మత్తులో నుండి దొంగ తేరుకొని నిద్ర లేచాక అతనిని బంధించి పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో ఆ దొంగ పేరు సలీం అని అతను శారదానగర్ నివాసి అని తెలిసింది.దొంగతనానికి సలీం తో పాటు మరికొందరు ఆ ఇంటి లోపలికి వెళ్లారు.సలీం తో పాటు వచ్చిన మిగతా సభ్యులు సలీంకు పీకల దాకా మద్యం త్రాగించి, ఇంట్లో దొంగతనం చేసి పరారయ్యారు.సలీం ఇచ్చిన ఆధారాల ప్రకారం మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.







