డిజిటల్ చెల్లింపుల విషయంలో మనం మరో ముందడుగు వేయబోతున్నాం.అవును, వీటిని ఇపుడు మరింతగా ప్రోత్సహించడానికి యూపీఐ లైట్ సౌకర్యాన్ని ఆర్ బి ఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) ప్రారంభించింది.
అంటే ఇది యూపీఐకి అప్డేటెడ్ వెర్షన్ అని మీరు అనుకోవచ్చు.దాంతో ఇక లావాదేవీ ప్రక్రియను అనేది సులభతరం కానుంది.
ఇక యూపీఐ లైట్ ఫీచర్ ( UPI Lite feature )అనేది గతేడాది సెప్టెంబర్లోనే ఆర్ బి ఐ తీసుకురాగా పేటీఎం, ఫోన్ పే వంటివి దీనిని ప్రారంభించాయి.
మన దేశంలో, యూపిఐ( UPI ) ద్వారా జరిగే నగదు లావాదేవీలు గత రెండు మూడు సంవత్సరాలలో విపరీతంగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.దేశంలోని పల్లె నుంచి పట్టణం వరకు అన్నిచోట్లా యూపిఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి.2022 మే నెలలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం UPI లావాదేవీల్లో 50% లావాదేవీలు రూ.200, అంతకంటే తక్కువ విలువైనవి.
ఇకపోతే చిన్న చిన్న పేమెంట్స్ ట్రాఫిక్ పెరగడం వల్ల బ్యాంక్ సర్వర్ల మీద ఒత్తిడి పెరిగి కొన్నిసార్లు చెల్లింపులు నిలిచిపోతున్న సంగతి విదితమే.ఇపుడు వీటికి పరిష్కారంగా వచ్చిందే యూపిఐ లైట్.యూపిఐ లైట్ వినియోగదార్లు, లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా ‘ఆన్-డివైజ్’ ( ‘on-device’ )వాలెట్ ని ఉపయోగించి లావాదేవీ చెల్లింపు పూర్తి చేస్తారు.
అంటే బ్యాంక్ ఖాతా వరకు వెళ్లకుండా, కేవలం వాలెట్ ని వాడుకొని వీలైనంత వేగంగా చెల్లింపులు జరపవచ్చు.అయితే, దానికోసం ముందుగా ఆ వాలెట్లో డబ్బును జోడించాలి.ఇక యూపిఐ లైట్ వాలెట్లో ఒకేసారి గరిష్ఠంగా రూ.2 వేల వరకు యాడ్ చేసుకోవచ్చు.ఇలా రోజుకు రెండుసార్లలో రూ.4000 వరకు యాడ్ చేయవచ్చు.