అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ( Naga Chaitanya) లేటెస్ట్ గా నటించిన మూవీ ”కస్టడి” (Custody).కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
రిలీజ్ అయిన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా అయితే పెద్దగా రాణించడం లేదు.దీంతో మరోసారి అక్కినేని హీరోకు ప్లాప్ ఎదురయ్యింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాను తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో తెరకెక్కిన విషయం విదితమే.తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ బైలింగ్వన్ మూవీను శ్రీనివాస చిట్టూరి నిర్మించగా.ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందించారు.కస్టడీ కలెక్షన్స్ ఎలా ఉన్న ఈ తమిళ్ డైరెక్టర్ అందరిలో గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు.
మరి ఈ సినిమా తర్వాత ఈయన నెక్స్ట్ ఏంటి అనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది.కాగా తాజాగా అందుతున్న క్రేజీ బజ్ ప్రకారం ఈయన తన నెక్స్ట్ సినిమాను స్టార్ హీరోతో చేయబోతున్నట్టు టాక్.
మరి ఆ స్టార్ ఎవరో కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి ( Thalapathy Vijay ).ఈయనతో సినిమా ఓకే చేసేందుకు సన్నాహాలు కూడా జరుగు తున్నట్టు తెలుస్తుంది.

కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారు ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ కాంబోలో వచ్చే సినిమాను నిర్మించనున్నట్టు టాక్.విజయ్ కెరీర్ లో ఈ సినిమా 68వ సినిమాగా తెరకెక్కనుంది.మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.ప్రజెంట్ అయితే విజయ్ తన 67వ సినిమాను లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.లియో అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.







