ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది.దీంతో స్కూల్ దగ్గర ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఢిల్లీలోని సాకేత్ పుష్ప విహార్ లోని పబ్లిక్ స్కూల్ కు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.వెంటనే అప్రమత్తమైన అధికారులు పాఠశాలకు చేరుకుని సోదాలు నిర్వహించారు.
అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పేర్కొన్నారు.దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం మెయిల్ చేసిన దుండగుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.







