కంది పంట( Kandi crop ) సాగులో అధిక దిగుబడి పొందాలంటే పంట పూతకు వచ్చే సమయంలో, పిందె కాయల సమయంలో ఆశించే చీడపీడలను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.కంది పంటను ఆశించే చీడపీడలను ఎలా గుర్తించి.
ఎలా నివారించాలో చూద్దాం.కందిలో పూత వస్తున్న సమయంలో పచ్చ దోమ పురుగులు( Green mosquito larvae ), దీపపు పురుగులు, కాయ తోలుచు పురుగులు పంటను ఆశిస్తాయి.
కంది పంటను విత్తుకున్న నెల రోజుల నుంచి ఆకుపచ్చ పురుగులు పంటను ఆశించి, కొమ్మల చివరలో ఉండే రసాన్ని పూర్తిగా పీల్చడం వల్ల పైరు ఎదుగుదల సక్రమంగా ఉండదు.పెనుబంకా పురుగులు కొమ్మలలో, ఆకులలో, పూతల కాయల నుండి రసాన్ని పీల్చేస్తాయి.
తద్వారా కాయలు నల్లగా మారి తాలు గింజలు ఏర్పడతాయి.

శనగపచ్చ పురుగులు పూత, పిందెలపై తెల్లని గుడ్లు పెడతాయి.నుంచి పురుగులు బయటకు వచ్చి ఆకు యొక్క పత్ర హరితాన్ని, పిందెలను తినేస్తాయి.కాబట్టి కంది పంటకు చీడపీడల బెడద కాస్త ఎక్కువే.
మేలైన కంది విత్తనాలను, చీడ పీడల బెడదను ( Cumin seeds )తట్టుకునే రకాలను విత్తుకోవాలి.కంది పంట పొలంలో అక్కడక్కడ లింగాకర్షక బుట్టలను అమర్చి శనగపచ్చ పురుగుల ఉనికిని గుర్తించాలి.
అంతే కాకుండా పొలంలో అక్కడక్కడ పక్షి స్థావరాలను ఏర్పాటు చేయడం వల్ల కొంగలు, కాకులు పురుగులను తినే అవకాశం ఉంటుంది.వీటిని కంది పంట పూతకు రాకముందే ఏర్పాటు చేయాలి.

కంది పంట పూతకు వస్తూ ఉన్న సమయంలో ఐదు మిల్లీలీటర్ల వేప నూనెను ఒక లీటరు నీటిలో కలిపి, ఐదు గ్రాముల సబ్బు పొడి కలిపి లేత ఆకులు మొత్తం తడిచేలాగా పిచికారి చేయాలి.చీడ పీడల బెడద కాస్త ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో రెండు మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ ( Endosulfan )కలిపి పంటకు పిచికారి చేయాలి.అంతేకాకుండా ఎండిన వేప గింజలను ముద్దలాగా నూరుకొని ఓ గుడ్డలో వదులుగా కట్టి రాత్రల్లా నీటి లో ఉంచి మరుసటి రోజు ఆ వేప కషాయం ను రెండు లేదా మూడుసార్లు పంటకు పిచికారి చేయడం వల్ల చీడపీడల బెడద ను పూర్తిగా నివారించవచ్చు.







